భయపెట్టేలా జీవ పిండం..
ఇటీవల కాలంలో హారర్ త్రిల్లర్ సినిమాలకు ఏ స్థాయిలో గుర్తింపు అందుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
ఇటీవల కాలంలో హారర్ త్రిల్లర్ సినిమాలకు ఏ స్థాయిలో గుర్తింపు అందుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అయితే అందుకుంటున్నాయి. ఇక బాక్సాఫీస్ వద్ద త్వరలోనే అలాంటి మరొక సినిమా అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. పిండం అనే ఆ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో సపోర్ట్ కూడా చేశారు.
శ్రీరామ్ కథానాయకుడుగా నటించిన పిండం సినిమా టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. డిఫరెంట్ హారర్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెర పైకి రాబోతున్న ఈ సినిమాను ప్రమోషన్స్ తో కూడా గట్టిగానే హైలెట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన పాటలు విడుదల చేసి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
అనిల్ మాట్లాడుతూ.. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ చూశాను. చాలా బాగా ఆకర్షించింది. స్కెరియస్ట్ ఫిలిం అనే క్యాప్షన్ కి తగ్గట్టుగానే సినిమా కంటెంట్ ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన వారు వారి నటనతో సినిమాకు మరింత బలం చేకూర్చారు అనిపిస్తోంది. శ్రీరామ్ గారు చాలా రోజుల తర్వాత మళ్లీ కథానాయకుడుగా ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం చాలా బాగుంది.
ఇక అవసరాల శ్రీనివాస్ ఖుషి మరియు మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సినిమాలో బాగా నటించారు. ఇక ఈ సినిమాలో జీవ పిండం అనే పాటను లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. పాట వినగానే చాలా మందికి కనెక్ట్ అవుతుంది అనిపించింది. ఇక ఈ పాట లో అసలు కథ హైలెట్ చేసే విధంగా లిరిక్స్ రాసినట్లు కూడా తెలుస్తుంది.
పిండం సినిమాను తప్పకుండా అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇక ఈ పాటను కృష్ణ సౌరభ్ సూరంపల్లి స్వరపరిచగా కవి సిద్ధార్థ సాహిత్యంలో ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. పిండం సినిమా కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో.. మూడు టైమ్ జోన్ లలో జరిగేదిగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుందట.