ఔను.. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్న హీరోయిన్‌

ది ట్రిప్‌, యువర్స్‌ లవింగ్లీ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సౌమ్య శెట్టి బంగారం కేసులో అరెస్ట్‌ అయ్యింది

Update: 2024-03-04 07:13 GMT

ది ట్రిప్‌, యువర్స్‌ లవింగ్ లీ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సౌమ్య శెట్టి బంగారం కేసులో అరెస్ట్‌ అయ్యింది. విశాఖపట్నంలోని ప్రసాద్ అనే రిటైర్డ్‌ పోస్టల్ ఉద్యోగి కుటుంబంకు సౌమ్య తో గత కొన్నాళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన కూతురు తో ఉన్న స్నేహం ను అదునుగా చేసుకుని ఇంట్లోని దాదాపు 750 గ్రాముల బంగారం ను సౌమ్య శెట్టి దొంగిలింది.

ప్రసాద్‌ కేసు పెట్టడంతో పోలీసులు ఒక్క రోజులోనే కేసు ఛేదించారు. ఆమె యొక్క మొబైల్ డేటా ఇతర విషయాలను ఆధారంగా చేసుకుని ఎంక్వౌరీ చేసిన పోలీసులకు ఆమె గోవాలో ఉన్నట్లు తెలిసింది. అక్కడే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే సౌమ్య తాను చేసిన దొంగతనం ఒప్పుకుందని పోలీసులు పేర్కొన్నారు. బంగారం ను లలితా జ్యువెలరీ లో పాత బంగారం గా అమ్మేసింది. కొంత వరకు కొత్త నగలు చేయించుకుంది. కొంత బంగారం ను డబ్బు కోసం అమ్మేసిందట. వచ్చిన డబ్బు తో జల్సాలు చేసింది.

గోవాలో రూ.4 లక్షల రూపాయలను ఖర్చు చేసిన సౌమ్య, తనకు ఉన్న రూ.2 లక్షల అప్పులను తీర్చి వేసి దాదాపు లక్షన్నర రూపాయలతో కారును రిపేర్‌ చేయించుకుంట. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సౌమ్య నుంచి బంగారం మరియు నగదు రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జల్సాలకు అలవాటు అయిన సౌమ్య డబ్బు లేక పోవడంతో ఈ పని చేసిందట. స్నేహితురాలి ఇంటి సభ్యులు అంతా నన్ను ఇంటి మనిషిగా నమ్మారు. అందుకే తాను ఈ పని చేయగలిగాను అంటూ పోలీసుల ఎంక్వైరీ లో సౌమ్య చెప్పినట్లు సమాచారం అందుతోంది.

Tags:    

Similar News