ధూమ్ -4 కి సౌత్ కోటింగ్ ఇస్తున్నారా?

ఇండియాలో ` ధూమ్` ప్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-09-29 15:30 GMT

ఇండియాలో ` ధూమ్` ప్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన మూడు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన‌వే. దీంతో ధూమ్ -4 ని య‌శ్ రాజ్ ఫిల్మ్స్ మ‌రింత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో తెర‌కెక్కించాల‌నుకున్నారు. కానీ ఎందుక‌నో సాధ్య‌ప‌డలేదు. ఆ త‌ర్వాత ర‌ణ‌వీర్ సింగ్ పేరు తెర‌పైకి వ‌చ్చింది.

అత‌డు కూడా ఫైన‌ల్ కాలేదు. చివ‌రిగా నెగిటివ్ రోల్ కి ర‌ణ‌బీర్ క‌పూర్ ని ఫైన‌ల్ చేసిందా సంస్థ‌. అయితే ఇప్పుడీ సినిమాని కేవ‌లం హిందీ లోనే కాకుండా పాన్ ఇండియాలో పెద్ద ఎత్తున య‌శ్ రాజ్ ఫిలింస్ ప్లాన్ చేస్తోందిట‌. దీనిలో భాగంగా సినిమాలో పాత్రల ఫరిదిని విస్త‌రిస్తూ క‌థ సిద్దం చేస్తున్నారుట‌. ఈనేప‌త్యంలో సౌత్ స్టార్ల‌కు పెద్ద పీట వేయాల‌ని చూస్తోందిట‌. ఇప్ప‌టికే విల‌న్ గా కోలీవుడ్ హీరో సూర్య ని ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

గ‌తంలో ప్ర‌భాస్ తోనూ య‌శ్ రాజ్ ఫిలింస్ మంత‌నాలు జ‌రిపింది. మెయిన్ లీడ్ కి అత‌న్ని ఎంపిక చేయాల‌ని ప్లాన్ చేసారు? కానీ అది జ‌ర‌గ‌లేదు. మ‌రి తాజా స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ప్ర‌భాస్ ని ఇంకేదైనా రోల్ కి దించుతున్నారా? అందుకు అత‌డు ఒప్పుకుంటాడా? అన్న‌ది తెలియాలి. వాళ్లే కాకుండా మ‌రికొంత మంది తెలుగు..త‌మిళ న‌టుల్ని సినిమాలో భాగం చేయాల‌నుకుంటున్నారుట‌.

ఇదే నిజ‌మైతే ఈ సినిమా ఓ సంచ‌ల‌నం అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ధూమ్ సిరిస్ కి సౌత్ లోనూ మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి కంటెంట్ లో సౌత్ న‌టులు భాగ‌మైతే వండ‌ర్స్ క్రియేట్ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. నిర్మాత ఆదిత్య చోప్రా ఆ ప్లాన్ లో భాగంగానే ఇలా ప్లాన్ చేస్తున్నాడ‌నే ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

Tags:    

Similar News