రాజ‌మౌళి త‌ర్వాత ఆ స్థానం ఎవ‌రిది?

ఇండియా గ్రేట్ డైరెక్ట‌ర్ల‌లో ద‌ర్శ‌క శిఖ‌రం రాజ‌మౌళి ఒక‌రు. 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' లాంటి చిత్రాల‌తో అంత‌ర్జాతీయంగానూ ఫేమ‌స్ అయ్యారు

Update: 2023-11-07 15:30 GMT

ఇండియా గ్రేట్ డైరెక్ట‌ర్ల‌లో ద‌ర్శ‌క శిఖ‌రం రాజ‌మౌళి ఒక‌రు. 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' లాంటి చిత్రాల‌తో అంత‌ర్జాతీయంగానూ ఫేమ‌స్ అయ్యారు. ఇండియాలో ఎంతో మంది గొప్ప ద‌ర్శ‌కులున్నా! వాళ్ల‌కి భిన్నంగా రాజ‌మౌళి పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమ్రోగింది. ఇక పాన్ ఇండియాలో జ‌క్క‌న్న రేంజ్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. అన్ని ప‌రిశ్ర‌మ‌ల హీరోలు రాజ‌మౌళి కోసం క్యూ క‌డుతున్నారు.

మ‌రి రాజ‌మౌళి త‌ర్వాత ఆ స్థానం సౌత్ నుంచి ఎవ‌రిది? ఆయ‌న్ని ట‌చ్ చేయాల‌ని చూసే ద‌ర్శ‌కులు ఎంత మంది? ఆయ‌న్ని దాటి ముందుకెళ్లాల‌ని ఎంత మంది క‌ల‌లు గంటున్నారు? అంటే! ప్ర‌ముఖంగా ముగ్గురు పేర్లు చ‌ర్చ‌కొస్తున్నాయి. వాళ్లే సుకుమార్.. లోకేష్ క‌న‌గ‌రాజ్.. ప్రశాంత్ నీల్. మ‌ణిర‌త్నం..శంక‌ర్ లాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుల్ని ప‌క్క‌న‌బెడితే నేటి త‌రం ద‌ర్శ‌కుల్లో ఈ ముగ్గురు రాజ‌మౌళి లా గ్రేట్ అనిపించుకోవాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 'రంగ స్థ‌లం'.. 'పుష్ప‌' లాంటి చిత్రాల‌తో సుకుమార్ లెవ‌ల్..లెక్క వేరే అని అర్ధ‌మైంది. ఆ రెండు చిత్రాల్లో సుకుమార్ అసాధ‌ర‌ణ క్రియేటివిటీ క‌నిపిస్తుంది.

పాన్ ఇండియాలో పుష్ప సాధించిన విజ‌యం లెక్క‌లు మాష్టారుకి అంతర్జాతీయంగానే ఫేమ‌స్ అయ్యేలా చేసింది. అందులో పాటల‌తోనే ఈసినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అనే డిస్క‌ష‌న్ సోష‌ల్ మీడియాలో జ‌రిగింది. సుకుమార్ అసాధ‌ర‌ణ క్రియేటివీటికి తాను ఇక్క‌డ ఉండాల్సిన ద‌ర్శ‌కుడు కాదంటూ కితాబిచ్చిన వారెంతో మంది. ఇక కేజీఎఫ్ ప్రాంచైజీతో ప్ర‌శాంత్ నీల్ అంతే ఫేమ‌స్ అయ్యాడు. ఆ సినిమా రెండు భాగాలు పాన్ ఇండియాని షేక్ చేసి కోట్ల రూపాయల వ‌సూళ్లు సాధించ‌డంతో నీల్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగింది.

అత‌నితో సైతం సినిమాలు చేయ‌డానికి స్టార్ హీరోలంతా క్యూలో ఉన్నారు. అలాగే ఖైదీ..విక్ర‌మ్ లాంటి సినిమాల‌తో త‌న‌కంటూ ఓ యూనివ‌ర్శ్ క్రియేట్ చేసుకుని మార్కెట్ లో బ్రాండ్ లా మారాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. ఆ రెండు విజ‌యాలు లోకేష్ కి పాన్ ఇండియాలో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అత‌నితో ప‌నిచేయ‌డానికి అన్ని ప‌రిశ్ర‌మ‌ల హీరోలు క్యూలో ఉన్నారు. అయితే ఈ వ‌రుస‌లో అట్లీని చేర్చ‌డం స‌మ‌జ‌సం కాద‌న్న విమ‌ర్శ ఉంది. అత‌ని శైలి వేరు. అట్లీ కేవ‌లం క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తాడు? త‌ప్ప అందులో ప్ర‌త్యేక‌త అంటూ ఏదీ ఉండ‌దు. రోటీన్ ఫార్మెట్ లోనే అత‌ని సినిమాలుంటాయి.

'జ‌వాన్' లాంటి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 700 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించినా అదంతా షారుక్ ఇమేజ్ సాధ్య‌మైంది త‌ప్ప అట్లీ క్రియేటివీటీతో కాద‌ని ఓ విమ‌ర్శ ఉంది. ఈ నేపథ్యంలో అట్లీని వాళ్ల స‌ర‌స‌న చేర్చ‌డం ఆమెద‌యోగ్య‌మైంది కాదని కొంద‌రు అభిప్రాయ‌పడుతున్నారు.

Tags:    

Similar News