చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి!

మీడియాలో కూడా ఈ జంట అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.

Update: 2024-06-19 06:42 GMT

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూశారు. కుటుంబసభ్యుల తెలిపిన ప్రకారం, శిరీష్ అనారోగ్యం కారణంగా చాలాకాలంగా బాధపడుతున్నారు. లంగ్స్ డ్యామేజ్ సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను ఇటీవల కొలుకున్నట్లు కనిపించారని, అయితే హఠాత్తుగా పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆయన కన్నుమూసినట్లు తెలిపారు.

గతంలో పెద్దలను ఎదిరించి, శ్రీజ, శిరీష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి వివాహం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. మీడియాలో కూడా ఈ జంట అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. రాజకీయంగా కూడా చాలా రకాల వార్తలు వచ్చాయి. అయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మంచి మనసుతో వారిని దగ్గరికి తీసుకున్నారు. మీడియా ముఖంగా కూడా కుతురిపట్ల ప్రేమని చూపించారు. అయితే అంతా సవ్యంగా ఉన్న సమయంలో కొద్ది రోజులకే వీరు విడిపోయారు.

ఇక శ్రీజ -శిరీష్ కు ఒక పాప కూడా ఉంది. ఇక విడిపోయిన అనంతరం మెగాస్టార్ కూతురిని దగ్గరికి తీసుకుని మనవరాలి బాధ్యతను కూడా ఆయనే తీసుకున్నారు. ఇక శిరీష్ విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకున్నారు. శ్రీజ కూడా మరో వివాహం చేసుకున్నారు. ఎవరి జీవితాల్లో వారు సంతోషంగా కొనసాగారు. ఇక హఠాత్తుగా శిరీష్ ఇప్పుడు మృతి చెందడంతో ఆయన కుటుంబం, స్నేహితులు, పరిచయస్తులు తీవ్ర విషాదంలో మునిగారు.

Tags:    

Similar News