శ్రీలీలా న్యూ లుక్.. ఆ డ్రెస్సుకే అందం వచ్చింది

శ్రీలీలా తాజాగా షేర్ చేసిన ఫొటోలలో ఆమె గ్లామర్‌ పాత్రను మరింత హైలైట్ చేస్తూ కనిపిస్తుంది.

Update: 2024-10-14 07:01 GMT

అందాల భామ శ్రీలీల కమర్షియల్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నా, ఆశించిన స్థాయిలో విజయాలు ఇంకా అందుకోలేకపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన "గుంటూరు కారం" సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకోగా ఈ చిత్రం అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. అంతేకాదు, సినిమాలో ఆమె పాత్ర కూడా ప్రధానంగా పాటలకే పరిమితమైందే తప్ప, నటనకు పెద్దగా అవకాశం దొరకలేదు.


ఇక పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాపై కూడా కొంత ఆందోళన నెలకొంది, ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ ఎప్పుడవుతుందన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో, శ్రీలీల ప్రస్తుతం తన ఆశలన్నీ నితిన్ చేస్తున్న "రాబిన్ హుడ్" చిత్రంపైనే పెట్టింది. అలాగే మరో రెండు ప్రాజెక్టులు శ్రీలీల చేతిలో ఉన్నాయి. ఇక బాలీవుడ్‌లో కూడా ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.


బాలీవుడ్ లో ఒక యువ హీరోతో నటించడానికి శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఈ సినిమాలో నటించడం ద్వారా బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ఆమె ఆశిస్తోంది. శ్రీలీల మంచి డాన్సర్‌ అని తెలిసిందే. ఈ కారణంగా పలువురు నిర్మాతలు ఆమెతో ఐటెం సాంగ్స్ చేయాలని ఆసక్తిగా ఉన్నారు. కానీ శ్రీలీల మాత్రం ఇటువంటి పాటలలో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

శ్రీలీలా తాజాగా షేర్ చేసిన ఫొటోలలో ఆమె గ్లామర్‌ పాత్రను మరింత హైలైట్ చేస్తూ కనిపిస్తుంది. ప్రకృతి సోయగాల మధ్య ఆమె వేసిన డిజైనర్ గౌన్‌, ఆత్మవిశ్వాసంతో కూడిన పోజులు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ ఫొటోషూట్‌లో ఆమె ధరించిన ఎర్త్‌టోన్ గౌన్‌ సహజ సుందరత్వానికి మెరుగులు అద్దింది. గార్డెన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ లుక్ మరింత ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు ఆమె అభిమానులను బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల కొద్దీ లైకులు సాధించడమే కాదు, కామెంట్స్‌లో అభిమానులు ఆమె లుక్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. శ్రీలీలా తన అభిరుచి, ఫ్యాషన్‌ను ప్రతి ఫోటోలో ఎంతో ఇమిడ్చింది. మొత్తం మీద, ఈ లుక్ ఆమెకు ఒక ఫ్రెష్ అండ్ గ్లామరస్ టచ్ ఇచ్చిందని చెప్పవచ్చు.

Tags:    

Similar News