గుంటురు కారం కొత్త ట్విస్ట్​.. శ్రీలీల ఒప్పుకుంటుందా?

'ఔట్ ఆఫ్ లవ్'​ అనే వెబ్​సిరీస్​లో మీనాక్షి చౌదరి నటనకు ఫిదా అయినా మేకర్స్​.. శ్రీలీల ప్లేస్​లో మీనాక్షి తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

Update: 2023-09-07 02:30 GMT

సూపర్‌ స్టార్‌ మహేశ్​ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్.. ఎన్నో కష్టాలు, సమస్యలను ఎదుర్కొని ఎట్టకేలకు ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే దిశగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పుడీ మళ్లీ ఈ సినిమా విషయంలో ఓ కొత్త ట్విస్ట్​ తెరపైకి వచ్చింది.

కథానాయికల విషయంలో ఫ్యాన్స్​ షాకయ్యేలా ఓ సరికొత్త వార్త తెరపైకి వచ్చింది. మొదట ఈ సినిమాలో పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ఎంపికైన సంగతి తెలిసిందే. రెండో హీరోయిన్​గా యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ సడెన్​గా పూజా హెగ్డే తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలా సస్పెన్స్​తో గ్యాప్ ఇచ్చి.. శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేశారు. హిట్ ఫేమ్ మీనాక్షి చౌదరిని రెండో హీరోయిన్​గా ఎంపిక చేశారు.

హమ్మయ్య హీరోయిన్​ టెన్షన్​ తప్పింది అనుకుంటే ఆ తర్వాత పలు సమ్యస్యలతో సినిమా ఆగుతూ వచ్చి రీసెంట్​గా షురూ అయింది. కానీ ఇప్పుడు మళ్లీ హీరోయిన్స్ విషయంలో మూవీటీమ్​ ఓ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఫిల్మ్​మేకర్స్​ శ్రీలీల ప్లేస్​లోకి మీనాక్షి చౌదరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.

'ఔట్ ఆఫ్ లవ్'​ అనే వెబ్​సిరీస్​లో మీనాక్షి చౌదరి నటనకు ఫిదా అయినా మేకర్స్​.. శ్రీలీల ప్లేస్​లో మీనాక్షి తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ధమాకా బ్యూటీ రెండో హీరోయిన్​గా నటించేందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అసలే ఆమె ఈ మధ్య మెయిన్ లీడ్​లో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఒప్పుకుంటుందో లేదో.

ఒకవేళ శ్రీలీల ఈ సెకండ్​ హీరోయిన్​గా నటించేందుకు ఒప్పుకుంటే ఓకే.. లేదంటే నో చెప్పి తప్పుకునే పరిస్థితి ఏర్పడితే... మేకర్స్ కొత్త టెన్సషన్ మళ్లీ మొదలైనట్టే. చూడాలి మరి మేకర్స్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఏం జరుగుతుందో అనేది.

Tags:    

Similar News