శ్రీలీల హిట్ పర్సెంటేజ్ ఎంత అంటే..?

యువ హీరోయిన్ శ్రీలీల లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ధమాకాతో సూపర్ హిట్ అందుకున్నా ఈ ఏడాది మాత్రం అమ్మడికి అంతగా కలిసి రాలేదని చెప్పాలి

Update: 2023-12-26 23:30 GMT

యువ హీరోయిన్ శ్రీలీల లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ధమాకాతో సూపర్ హిట్ అందుకున్నా ఈ ఏడాది మాత్రం అమ్మడికి అంతగా కలిసి రాలేదని చెప్పాలి. చేయడానికి 2023 లో నాలుగు సినిమాలు చేసినా అందులో ఒక్క సినిమా తప్ప మిగిలిన 3 సినిమాలు శ్రీలీలకు నిరాశ మిగిల్చాయి. ధమాకా హిట్ పడగానే ఒక్కసారిగా ఆరేడు సినిమా ఆఫర్లు వచ్చాయి. వాటన్నిటినీ ఓకే చేసింది శ్రీలీల.

ఈ ఇయర్ 4 సినిమాలు శ్రీలీల నుంచి వచ్చాయి. బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్ లో వచ్చిన స్కంద సినిమాలో నటించింది శ్రీ లీల. ఊర మాస్ సినిమాగా వచ్చిన స్కంద ఎలా వచ్చిందో అలానే వెళ్లింది. ఇక ఆ తర్వాత బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో విజ్జి పాత్రతో మెప్పించింది శ్రీలీల. సినిమా సక్సెస్ అవడంతో హమ్మయ్య అనుకుంది. సినిమాలో బాలకృష్ణకి ఈక్వల్ రోల్ లో నటించి మెప్పించింది శ్రీ లీల.

ఇక ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ సినిమాతో వచ్చింది శ్రీలీల. ఆ సినిమా కూడా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించడం విశేషం. ఇక డిసెంబర్ లో నితిన్ తో ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ అంటూ వచ్చింది శ్రీ లీల. ఈ సినిమా కూడా ఇలా వచ్చి అలా వెళ్లింది. పోటీగా వచ్చిన నాని హాయ్ నాన్న హిట్ అయితే నితిన్ సినిమా మాత్రం దెబ్బ కొట్టింది.

సో 2023 లో నాలుగు క్రేజీ సినిమాలు చేసిన శ్రీ లీల కేవలం ఒకే ఒక్క హిట్ తో 25 శాతం హిట్ పర్సెంటేజ్ తో సరిపెట్టుకుంది. అయితే శ్రీ లీలకు ఫ్లాపులు పడుతున్నా సరే అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ అమ్మడు మహేష్ తో గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలతో అయినా శ్రీ లీల హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. త్రివిక్రం డైరెక్షన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల పాత్రకు మంచి క్రేజ్ వస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. మరి 2024 లో అయినా శ్రీ లీల సక్సెస్ పర్సెంటేజ్ పెంచుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News