వాటితో పోల్చితే డాన్సు అనేది పెద్ద కష్టం కాదు!
యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంత గొప్ప డాన్సర్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. అందులో తానెంత ట్యాలెంటెడ్ గాళ్ అన్నది తొలి సినిమా 'పెళ్లి సందడి'తోనే నిరూపించింది
యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంత గొప్ప డాన్సర్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. అందులో తానెంత ట్యాలెంటెడ్ గాళ్ అన్నది తొలి సినిమా 'పెళ్లి సందడి'తోనే నిరూపించింది. అందులో డాన్సుకు ఆస్కారం ఉండటంతో మొదటి సినిమాతోనే తానో గొప్ప డాన్సర్ అని ప్రూవ్ చేసింది. అందం+ డాన్స్ తో శ్రీలీల ఇండస్ట్రీని దృష్టిని ఆకర్షించింది. ఈ రెండు స్కిల్స్ తో పాటు కలివిడి తనంతో కొత్త అవకాశాలు అందుకోగల్గింది. తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేస్ సరసన `గుంటూరు కారం`లో ఛాన్స్ అందుకుంది.
పూజాహెగ్డే తప్పుకోవడంతో లక్కీగా ఆ ఛాన్స్ శ్రీలీలకి వరించింది. అందులో అమ్మడు కుర్చీ ఏ రేంజ్ లో మడత పెట్టిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ పాటతో మాస్ ఆడియన్స్ కి మరింత చేరింది. అంతకు ముందు `ధమాకా` లో మరో మాస్ పాటతోనూ దూసుకుపోయింది. ఈ రెండు సినిమాలు అమ్మడి కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రాలుగా నిలిచిపో యాయి. అయితే శ్రీలీల అంత గొప్ప డాన్సర్ కావడానికి కారణం తల్లిదండ్రులే. చిన్నప్పుడే తల్లిదండ్రులు భరతనాట్యం క్లాస్ లకు పంపించేవారు.
ఆ తర్వాత సినిమాకి అవసరమైన ట్రైనింగ్ లు ఇప్పించారు. అందువల్లే ఆమె డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే తానెంత గొప్ప డాన్సర్ అయినా హీరోలు చేసే పైట్లు ముందు తక్కువే అని మరోసారి తని నిరాడంబరతను చాటుకుంది. అమ్మడిలో డాన్సింగ్ స్కిల్స్ చూసి కొంత మంది పొగిడేసినా మునగ చెట్టు ఎక్కకుండా హీరోల కష్టాన్ని గుర్తించి మాట్లాడింది. చివరికి తన శ్రమని కూడా తక్కువగానే అంచనా వేసింది.
`హీరోలు సెట్స్ లో ఎంతో కష్టపడి యాక్షన్ సన్నివేశాలు చేస్తుంటారు.సెట్స్ లో వాళ్ల శ్రమ చూసి ఆశ్చర్యపోతుంటా. అప్పుడు వాళ్లపై మరింత గౌరవం పెరిగింది. వాటితో పోల్చితే డాన్సు అనేది పెద్ద కష్టం కాదన్నది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీలీల కోలీవుడ్ లో లాంచ్ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఇటీవలే ఓ కాలేజ్ ఈవెంట్ లో ఐయామ్ రెడీ అంటూ కోలీవుడ్ కి సిగ్నెల్స్ పంపించిన సంగతి తెలిసిందే.