శ్రీలీలకు మరో పల్సర్ బైక్ దొరికేది ఎప్పుడో?

పాట ప్రోమో లో శ్రీలీల జోరు చూస్తూ ఉంటే పాట మరో పల్సర్‌ బండి, దండ కడియాల్‌ పాటల మాదిరిగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.

Update: 2023-08-02 07:01 GMT

పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల ధమాకా సినిమా లో తన అందాల విందు ఇంకా సూపర్‌ డాన్స్ కారణంగా మంచి మార్కులు దక్కించుకుంది. పైగా ఆ సినిమా సూపర్‌ హిట్ అవ్వడం వల్ల వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు... చర్చల దశలో ఉన్న సినిమాలన్నీ కలిపి దాదాపు పది ఆమె చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ధమాకా వంటి సక్సెస్ పడితే స్టార్‌ హీరోల కు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారడం ఖాయం. అందుకోసం ప్రస్తుతం చేస్తున్న స్కంధ సినిమా పై శ్రీలీల ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న స్కంధ సినిమా లో శ్రీలీల మరోసారి తన అందాల విశ్వరూపం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్కంధ సినిమా నుంచి మొదటి పాట ను రేపు అంటే ఆగస్టు 3వ తారీకున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. నీ చుట్టు చుట్టు అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నారు. పాట ప్రోమో లో శ్రీలీల జోరు చూస్తూ ఉంటే పాట మరో పల్సర్‌ బండి, దండ కడియాల్‌ పాటల మాదిరిగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.

థమన్ సంగీతాన్ని అందించిన నీ చుట్టు చుట్టు... పాట మాస్ ఆడియన్స్‌ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడం ఖాయం అన్నట్లుగా ప్రోమో ఉందని రామ్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ డాన్స్ లో సూపర్‌ ఎనర్జిని చూపిస్తాడు. ఇక శ్రీలీల కూడా అందుకు తక్కువేం కాదు అని ఇప్పటికే నిరూపించుకుంది.

నీ చుట్టు చుట్టు పాట లో రామ్‌, శ్రీలీల లు పోటీ పడి మరీ డాన్స్ చేసే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య సాగే ఈ డాన్స్ పోరులో ఎవరిది పై చేయి అవుతుంది అనేది చూడాలి. మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న పాట సినిమా ఫలితాన్ని నిర్ణయించే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పాట మంచి టాక్ దక్కించుకోవడంతో పాటు డాన్స్‌ తో శ్రీలీల అలరిస్తే తప్పకుండా ఆమె క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ కు ఈ సినిమా సక్సెస్‌ అవసరం చాలా ఉంది. శ్రీలీల.. రామ్‌ జోడీ సూపర్‌ గా సెట్‌.. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో...!

Tags:    

Similar News