శ్రీలీలకు అక్కడ గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో..

2023లో శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా.. భగవంత్ కేసరి తప్ప మిగతా మూడు కూడా ఫ్లాప్ అయ్యాయి

Update: 2024-04-23 02:30 GMT

పెళ్లిసందD మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ శ్రీలీల.. మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో పాటు డ్యాన్స్ తో తెలుగు సినీ ప్రియులను తెగ అలరించింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా సినిమా ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు అందుకుంది. కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది.

2023లో శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా.. భగవంత్ కేసరి తప్ప మిగతా మూడు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చినా.. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమా మిక్స్ డ్ టాక్ అందుకుంది. విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు నుంచి ఆమెనే తప్పుకుంది. ఇటీవల నితిన్ రాబిన్ హుడ్ మూవీ నుంచి ఆమెను తప్పించి రాశీ ఖన్నాను మేకర్స్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

వరుసగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో మెప్పించకపోవడంతో శ్రీలీల కాస్త సైలెంట్ అయినట్లు సమాచారం. కెరీర్ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త స్క్రిప్ట్ ల ఎంపికలో జాగ్రత్త పడుతున్నట్లు టాక్. అయితే తాజాగా ఈ బ్యూటీకి అదిరిపోయే ఛాన్స్ వచ్చిందని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు జోడీగా శ్రీలీల నటించనుందట.

అజిత్ హీరోగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైనట్లు సమాచారం. మార్క్‌ ఆంటోనీ మూవీ ఫేమ్ అధిక్‌ రవిచంద్రన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ సంప్రదించగా కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట శ్రీలీల. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న శ్రీలీల ఫ్యాన్స్.. ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ సినిమాతో శ్రీలీల కెరీర్ గ్రాఫ్ మారిపోతుందని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి బిగ్ ప్రాజెక్ట్ తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది శ్రీలీల. అయితే తెలుగులో ఈ మధ్య వరుసగా ఫ్లాపులు మూటగట్టుకుంది. పెద్ద సినిమాల్లో ఆఫర్లు కూడా అందుకోలేకపోతోంది. ఇలాంటి సమయంలో శ్రీలీల.. ఈ తమిళ బిగ్ ఆఫర్ తో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News