ఇక్కడ ఖాళీ..అక్క‌డికి అందుకేనా లీలా!

శ్రీలీల టాలీవుడ్ లో ఖాళీ అయిపోయిందా? అందుకేనా కోలీవుడ్ వైపు చూస్తోంది? అంటే అవున‌నే తెలుస్తోంది.

Update: 2024-03-27 11:09 GMT

శ్రీలీల టాలీవుడ్ లో ఖాళీ అయిపోయిందా? అందుకేనా కోలీవుడ్ వైపు చూస్తోంది? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇండ‌స్ట్రీకి ఉవ్వెత్తున దూసుకొచ్చిన అమ్మ‌డు నిన్న మొన్న‌టివ‌ర‌కూ అలాగే సినిమాలు చేసింది. `పెళ్లి సంద‌డి` త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అటుపై స్టార్ హీరోల‌కు ప్ర‌మోట్ అవ్వ‌డం అంతా వేగంగా జ‌రిగిపోయింది. ర‌వితేజ‌..రామ్..బాల‌య్య‌..మ‌హేష్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో త‌క్కువ స‌మ‌యంలోనే అవ‌కాశాలు అందుకుంది. దీంతో అమ్మ‌డు నెంబ‌ర్ వ‌న్ స్థానానికి అతి చేరువలోనే ఉంద‌న్న టాక్ బ‌లంగా వినిపించింది.

కానీ ఇప్పుడా స‌న్నివేశం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇంకా చెప్పాలంటే చేతిలో అవ‌కాశాలే లేన‌ట్లు క‌నిపిస్తుంది. అమ్మ‌డు `గుంటూరు కారం` త‌ర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయింది. క‌మిట్ అయిన `ఉస్తాద్ భ‌గంగ్ సింగ్` షూటింగ్ మ‌ధ్య‌లో బ్రేక్ ప‌డింది. ఎన్నిక‌ల త‌ర్వాతే ఆ సినిమా షూటింగ్ ప్రారంభ‌య్యేది. ఆ ఛాన్స్ త‌ప్ప శ్రీలీల ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమాకి సంత‌కం చేసింది లేదు. ఇటీవ‌లే త‌మిళ‌నాడు లో కాలేజ్ ఈవెంట్ లో పాల్గొంది. ఆ ఈవెంట్ లో అమ్మ‌డు కోలీవుడ్ సినిమాలు చేయాల‌ని ఉంద‌న్న మ‌న‌సు లో కోర్కెను బ‌య‌ట పెట్టింది.

దీంతో తెలుగులో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ప‌ర‌భాష వైపు చూస్తుంది? అన్న సందేహాలు మొద‌ల య్యాయి. తెలుగులో ఛాన్సులున్నా..బిజీగా ఉన్నా కోలీవుడ్ వైపు ఇప్ప‌ట్లో చూసే అవ‌కాశం ఉండేది కాదు. `పెళ్లి సంద‌డి` త‌ర్వాత `ధ‌మాకా`లో ఛాన్స్ రావ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టింది. ఈ గ్యాప్ లో ఖాళీ ఎందుక‌ని రెండు క‌న్న‌డ సినిమాలు చేసింది. మ‌ళ్లీ ఇప్పుడు టాలీవుడ్ లో గ్యాప్ రావ‌డంతో ఈసారి కోలీవుడ్ వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా అమ్మ‌డు ఖాళీగా ఉండ‌కుండా ఏదో భాష‌లో అవ‌కాశం కోసం ట్రై చేయ‌డం గొప్ప విష‌యం. శ్రీలీల బ్యూటీకి అక్కడా అవ‌కాశాలు రాకుండా ఉండ‌వు. కాక‌పోతే అమ్మ‌డు స‌న్న‌జాజి సోయగం. చ‌బ్బీ భామ‌ల‌కున్న క్రేజ్ నాజూకు భామ‌ల‌కు పెద్ద‌గా ఉండ‌ద‌న్న విమ‌ర్శ ఉంది. మ‌రి అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు తగ్గ‌ట్లు విజిల్స్ వేసేలా మార్పులేమైనా తీసుకొస్తుందా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News