టాప్ వ్యూ లో శ్రీముఖి గ్లామర్ కిక్.. స్టన్నింగ్!
రీసెంట్ గా అమ్మడు ఒకవైపు ట్రెడిషనల్ టచ్ ఇస్తూనే మరొకవైపు తనలోని గ్లామర్ ను హైలైట్ చేసింది. బ్లాక్ కలర్ఫుల్ డ్రెస్సులలో అమ్మడు టాప్ వ్యూలో తన అందాలను మరింత అందంగా ప్రజెంట్ చేసింది.
టెలివిజన్ రంగంలో యాంకర్ గా మంచి గుర్తింపు అందుకున్న వారిలో శ్రీముఖి కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. చాలా రకాల రియాల్టీ షోలలో అమ్మడు మంచి యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇక ఆ తర్వాత మెల్లగా వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొదట జులాయి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలైన ఆమె ప్రయాణం ఆ తర్వాత కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించే స్థాయికి వచ్చింది.
శ్రీముఖి ఎలాంటి పాత్ర చేసిన కూడా డిఫరెంట్ గా యాక్ట్ చేస్తుంది అని మంచి క్రేజ్ అయితే అందుకుంది. అయితే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా పాత్రలో ఎంతో కొంత కొత్తదనం ఉంటే గానీ ఈ భామ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం లేదు. ఇక ఎక్కువ కాలం అయితే టెలివిజన్ ప్రపంచంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడే ఆమెకు మంచి రెమ్యునేషన్స్ కూడా వచ్చాయి.
ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసే ఫోటోలు ఏ రేంజ్ లో క్లిక్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రీసెంట్ గా అమ్మడు ఒకవైపు ట్రెడిషనల్ టచ్ ఇస్తూనే మరొకవైపు తనలోని గ్లామర్ ను హైలైట్ చేసింది. బ్లాక్ కలర్ఫుల్ డ్రెస్సులలో అమ్మడు టాప్ వ్యూలో తన అందాలను మరింత అందంగా ప్రజెంట్ చేసింది. ఇక ఫోటోను చూసిన ఫాలోవర్స్ చాలా పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు.
శ్రీముఖి మంచి గ్లామర్స్ రోల్స్ చేస్తే మాత్రం ఆమె కెరీర్ మరో స్థాయికి చేరుకుంటుంది అనేలా కూడా పలువురు ప్రశంసిస్తున్నారు. శ్రీముఖి ఎక్కువగా అయితే బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. ఇక తర్వాత ఆమెకు కొన్ని హీరోయిన్స్ గా కూడా అవకాశాలు వచ్చాయి. కానీ అందులో కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి.
ఇక మరికొన్ని రిలీజ్ అయినప్పటికీ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం శ్రీముఖి వీలైనంతవరకు యూట్యూబ్ అలాగే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే అప్పుడప్పుడు పలు రియాలిటీ షోలతో కూడా సందడి చేస్తోంది. మరి ఈ గ్లామర్ తో అమ్మడు రాబోయే రోజుల్లో బిగ్ స్క్రీన్ పై ఏవైనా మంచి అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.