లేడీ మన్నార్ తో బాలయ్య ఢీ షురూ...!
నందమూరి బాలకృష్ణ దాదాపు రెండు నెలల రాజకీయాల తర్వాత ఎట్టకేలకు సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
నందమూరి బాలకృష్ణ దాదాపు రెండు నెలల రాజకీయాల తర్వాత ఎట్టకేలకు సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా టైటిల్ ఖరారు కాని సినిమాలో కీలక పాత్రలో శ్రియా రెడ్డి నటిస్తుంది అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
ప్రస్తుతం బాలయ్య తో పాటు శ్రియా రెడ్డి కూడా షూటింగ్ లో పాల్గొంటుందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో శ్రియా రెడ్డిని అత్యంత పవర్ ఫుల్ పాత్రల్లో చూశాం. ముఖ్యంగా సలార్ లో రాధా రమా మన్నార్ పాత్రలో ఆమె నటనకు ఎంతటి ప్రశంసలు దక్కాయో అందరూ చూశారు.
కనుక ఆ స్థాయి పవర్ ఫుల్ పాత్రనే దర్శకుడు బాబీ కూడా తన సినిమాలో ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బాలయ్య సినిమాలో విలన్స్ గా పవర్ ఫుల్ పాత్రల్లో మగాళ్లు కనిపిస్తారు. అయితే ఈసారి లేడీ విలన్ తో బాలయ్య ఢీ కొట్టే అవకాశాలు కనపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇద్దరి కాంబో సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు వీరి కాంబో సన్నివేశాలు స్క్రీన్ పై చూస్తామా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య మరియు బాబీ మూవీ కి సంబంధించిన విడుదల తేదీ విషయంలో అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా బాలయ్య కూడా వరుసగా మూడు విజయాల తర్వాత ఈ సినిమాను చేస్తున్నాడు. ఎలా చూసినా కూడా ఈ సినిమా పక్కా కమర్షియల్ హిట్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇలాంటి సినిమాలో శ్రియా రెడ్డి వంటి లేడీ స్టార్ ను పవర్ ఫుల్ రోల్ లో చూపిస్తే సినిమా స్థాయి మరింతగా పెరగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. శ్రియా రెడ్డిని సలార్ 2 లో మరింత పవర్ ఫుల్ పాత్రలో చూస్తామనే వార్తలు వస్తున్నాయి.