దళపతి విజయ్ తనయుడిపై.. థమన్ కామెంట్స్ వైరల్..!
ఐతే ఈ ప్రాజెక్ట్ పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జాసన్ సంజయ్ స్క్రిప్ట్ నేరేట్ చేయడం చూసి షాక్ అయ్యాయని అన్నారు.
దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు. విజయ్ చివరి సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఐతే ఓ పక్క దళపతి విజయ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుంటే మరోపక్క అతని వారసుడు జాసన్ సంజయ్ సినీ ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ తనయుడు స్టార్ అవ్వాలని ప్రయత్నిస్తారు. అంటే తెర మీదే విజయ్ తనయుడు జాసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇస్తాడని అనుకుంటే సడెన్ గా అందరి అంచనాలకు అందకుండా డైరెక్టర్ గా జాసన్ సంజయ్ తెరంగేట్రం చేస్తున్నడు. ఈమధ్యనే అతని మొదటి సినిమా అఫీషియల్ అప్డేట్ వచ్చింది.
యువ హీరో సందీప్ కిషన్ తో జాసన్ సంజయ్ తొలి సినిమా వస్తుంది. ఓ పక్క తెలుగులో తన సినిమాలతో అలరిస్తూ తమిళ్ లో కూడా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు సందీప్ కిషన్. అందుకే జాసన్ సంజయ్ తొలి సినిమాను ఆయనతో చేస్తున్నాడు. దళపతి విజయ్ తనయుడి డైరెక్షన్ లో సందీప్ కిషన్ సినిమా అనగానే ఆ ప్రాజెక్ట్ మీద భారీ హైప్ ఏర్పడింది.
ఐతే ఈ ప్రాజెక్ట్ పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జాసన్ సంజయ్ స్క్రిప్ట్ నేరేట్ చేయడం చూసి షాక్ అయ్యాయని అన్నారు. అతనిలో స్టార్ ని డైరెక్ట్ చేసే కెపాసిటీ ఉందని తెలుస్తుంది. కానీ అతని ఫస్ట్ ఛాయిస్ సందీప్ కిషన్ పర్ఫెక్ట్ అనిపించింది. అతని కథకు సందీప్ పర్ఫెక్ట్ ఎంపిక అనిపించింది. కచ్చితంగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని అన్నారు థమన్.
తెలుగుతో పాటు తమిళంలో కూడా థమన్ అదరగొడుతున్నాడు. జాసన్ సంజయ్ తొలి సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఐతే కథ చెప్పే విధానం చూస్తేనే జాసన్ సంజయ్ టాలెంట్ తనకు అర్థమైందని అన్నారు థమన్. మరి స్టార్ తనయుడు డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. థమన్ చెప్పింది చూస్తుంటే జాసన్ సంజయ్ తెరగేట్రం తోనే భారీ హిట్ కొట్టేలా ఉన్నాడు. అంతేకాదు ఈ సినిమాతో సందీప్ కిషన్ కి కెరీర్ లో మంచి బూస్టింగ్ ఇచ్చేలా ఉంటుందని చెప్పొచ్చు. దళపతి విజయ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఎలాగు ఉంటుంది కాబట్టి జాసన్ సంజయ్ తొలి సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.