మహేష్ - రాజమౌళి.. బాబోయ్ ఇది నిజమేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే

Update: 2024-03-21 04:22 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు మూవీలో కనిపించబోతున్నాడు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మెజారిటీ మూవీ కథ నడుస్తుందని ఇప్పటికే స్పష్టం చేశారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీలో క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా సిద్ధం అవుతున్నారు. స్టోరీ సిద్ధం అయిపోవడంతో జక్కన్న ప్రస్తుతం క్యాస్టింగ్ ని ఫైనల్ చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ ని కీలక పాత్రల కోసం ఎంపిక చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ప్రస్తుతం ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది.

ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రతినాయకుడి పాత్ర కోసం స్టార్ హీరోలని పరిశీలిస్తున్నారంట. అందులో ముఖ్యంగా బాలీవుడ్ ప్రిన్స్ హృతిక్ రోషన్ పేరు వినిపిస్తోంది. హృతిక్ రోషన్ కటౌట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ధూమ్ 2లో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు. అయితే క్రూరమైన విలన్ గా మాత్రం ఏ సినిమాలో చేయలేదు.

ఒక వేళ రాజమౌళి హృతిక్ రోషన్ కి క్యారెక్టర్ ఆఫర్ చేస్తే కచ్చితంగా ఒప్పుకునే అవకాశం ఉంటుందనేది టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. హృతిక్ రోషన్ ని జక్కన్న అప్రోచ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే చియాన్ విక్రమ్ పేరు కూడా మూవీలో ప్రతినాయకుడి పాత్ర కోసం పరిశీలిస్తున్నారంట. విక్రమ్ అయిన కూడా కచ్చితంగా ఒకే చెప్పే అవకాశం ఉంది.

ఇప్పుడు స్టార్ హీరోలు కూడా భేషాజాలు చూపించకుండా అన్ని రకాల పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్ వార్ 2లో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లోనే కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే జక్కన్న సినిమాలో హృతిక్ రోషన్ గాని విక్రమ్ గాని నటిస్తే మూవీకి నెక్స్ట్ లెవల్ రీచ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి సెలక్షన్ అంటే కచ్చితంగా ఆ పాత్రకి 100 శాతం యాప్ట్ అవుతాడనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది.

మరి హృతిక్ రాజమౌళి ఆఫర్ ని ఒప్పుకుంటాడా అనేది చూడాలి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను సమ్మర్ తరువాత స్టార్ట్ చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ అయితే సిద్ధమైంది. ఇక త్వరలోనే వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేయనున్నారు. అందులో మహేష్ తో పాటు టెక్నీషియన్స్ అందరూ పాల్గొనబోతున్నారు. ఇక సినిమాను 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News