'డార్లింగ్ చించేశావ్.. 30 నిమిషాలు పీక్స్'.. రాజమౌళి 'కల్కి' రివ్యూ

వేరే లెవల్ లో కల్కి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లు కూడా ఈలలతో హోరెత్తుతున్నాయి

Update: 2024-06-27 13:51 GMT

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి కోసమే పోస్టులు, రివ్యూలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సందడి అయితే మాములుగా లేదు. వేరే లెవల్ లో కల్కి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లు కూడా ఈలలతో హోరెత్తుతున్నాయి.

ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎన్నో సర్ప్రైజ్ లు ఇచ్చారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, శోభన, మాళవిక, బ్రహ్మానందం, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ వంటి పలువురు నటీనటుల లుక్స్ ను ముందే రివీల్ చేసిన మేకర్స్.. సిల్వర్ స్క్రీన్ పై అనేక మందిని చూపించారు. ఒక్కొక్క క్యామియో రోల్ వస్తుంటే.. ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ సందడి చేస్తున్నారు. రాజమౌళి కూడా ఒక్క సీన్ లో కనిపించి అందరినీ అలరించారు.

ఇప్పుడు తాను నటించిన కల్కి సినిమాకు సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు రాజమౌళి. రివ్యూలో కూడా తన మార్క్ ను చూపించారు జక్కన్న. ఒక్కొక్క అంశాన్ని క్లియర్ గా వివరించారు. సినిమా కోసం నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ప్రపంచం బాగా నచ్చిందని తెలిపారు. అత్యద్భుతమైన సెటింగ్స్ తో వివిధ ప్రాంతాలకు తనను తీసుకువెళ్లిందంటూ నాగిపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. నెక్స్ట్ మెయిన్ క్యాస్టింగ్ గురించి మాట్లాడారు.

డార్లింగ్ తన ఈజ్, టైమింగ్‌ తో చించేశాడని కొనియాడారు రాజమౌళి. అమితాబ్ జీ, కమల్ సర్, దీపిక మంచి సపోర్ట్ ఇచ్చారని తెలిపారు. సినిమాలో చివరి 30 నిమిషాలు తనను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందని చెప్పారు. ఇలాంటి అనుభూతిని పంచిన నాగ్ అశ్విన్ తోపాటు వైజయంతీ టీమ్‌ కు ధన్యవాదాలు తెలిపారు. వాళ్లంతా ఊహకు అందని విధంగా సినిమా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు రాజమౌళి.

Read more!

బాహుబలి 1,2 చిత్రాలు, ఆర్ ఆర్ ఆర్ తో తెలుగు సినిమా ఖ్యాతిని రాజమౌళి విశ్వవ్యాప్తం చేసిన విషయం తెలిసిందే. ఇక కల్కి రిలీజ్ కు ముందు కూడా రాజమౌళి, నాగ్ అశ్విన్ ను చాలా మంది పోల్చారు. అయితే కల్కి సినిమా జక్కన్నకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. కట్టి పడేసినట్లు రివ్యూ ద్వారా అర్థమవుతోంది. ప్రస్తుతం రాజమౌళి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థ్యాంక్యూ సర్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News