ఆ స్టార్ హీరో ఫ్యామిలీ కి దూరంగానా?

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆ స్టారో వ్య‌క్తిగ‌త జీవితం మ‌రోసారి తెర‌పైకి వ‌స్తోంది. ఇది వాస్త‌వ‌మా? అవాస్త‌మా? పార్టీలు చేస్తోన్న రాజ‌కీయ‌మా?

Update: 2024-09-10 15:30 GMT

ఓ స్టార్ హీరో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే స‌ర్వం సిద్దం చేసుకుని రెడీగా ఉన్నాడు. ఇంత‌కాలం న‌టుడిగా సేవ‌లంచించాను..ఇక‌పై నాయ‌కుడిగా ప్ర‌జ‌ల‌కు సేవ‌నందిస్తా నంటూ క‌ద‌న‌రంగంలోకి దూకుతున్నాడు. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు సైతం న‌యా హీరోకి ఫేవ‌ర్ గానే క‌నిపిస్తున్నాయి. కొత్త పార్టీ కొత్త నాయ‌కుడు వ‌స్తే? న‌వ‌త‌రానికి నాంది ప‌లికిన‌ట్లు ఉంటుంద‌ని విశ్లేష‌కులు సైతం అంచ‌నా వేస్తున్నారు.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆ స్టారో వ్య‌క్తిగ‌త జీవితం మ‌రోసారి తెర‌పైకి వ‌స్తోంది. ఇది వాస్త‌వ‌మా? అవాస్త‌మా? పార్టీలు చేస్తోన్న రాజ‌కీయ‌మా? అన్న‌ది తెలియ‌దు గానీ అభిమానులు గుండె ప‌గిలే వార్త‌లాగే క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఆ స్టార్ హీరో ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో సవాళ్లు ఎదుర్కుంటున్న‌ట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంత కాలంగా ఆ హీరో కుటుంబానికి దూరంగా ఉంటున్నాడే ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది.

అందుకు కార‌ణం కుమారుడు, భార్య అన్న‌ట్లుగా వినిపిస్తుంది. ఇటీవ‌లే కుమారుడు స్టార్ హీరో మేనేజ‌ర్ తో పెద్ద గొడ‌వ ప‌డ్డాడుట‌. ఈ గొడ‌వ‌కి కార‌ణం ఏంటి అనేది రాజకీయాలు ఇష్టం లేక ఏంటి అనేది తెలియదు . ఈ కారణంగానే ఆకుటుంబంలో చీలిక ఏర్ప‌డింద‌ని, అందుకే ఆ స్టార్ హీరో కుటుంబానికి దూరంగా ఒంట‌రిగా ఉంటున్నాడ‌నే వార్త వినిపిస్తుంది. త‌ల్లి-కొడుకు ఒక ఇంట్లో..తండ్రి మ‌రో చోట దూరంగా ఉంటున్నారుట‌.

ఇటీవ‌లే రిలీజ్ అయిన ఆ స్టార్ హీరో సినిమా కూడా అత‌ని వ్య‌క్తి గ‌త జీవితానికి కాస్త ద‌గ్గ‌ర‌గానూ ఉంద‌ని కొంద‌రంటున్నారు. ఇక్క‌డే మ‌రో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. తొలి నుంచి తండ్రికి ఎలా దూర‌మ‌య్యాడో? ఇప్పుడు భార్య పిల్ల‌ల‌కు దూర‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో వాస్త‌వం తెలియాల్సి ఉంది. అయితే ఇది నిజ‌మా? లేక అత‌డి రాజ‌కీయ జీవితాన్ని దెబ్బ కొట్టాలి అన్న ఉద్దేశంతో ఉద్దేశ పూర్వ‌కంగా ప‌నిగ‌ట్టుకుని చేయిస్తోన్న ప్ర‌చార‌మా? అన్న‌ది కూడా తేలాల్సిన అంశం.

Tags:    

Similar News