స్టార్ హీరో యాడ్ రెవెన్యూ షాకిస్తోందే

నేడు అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు.

Update: 2024-02-18 02:30 GMT

'బ్యాండ్ బాజా బారాత్‌' (2010) చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రణవీర్ సింగ్ తాను విల‌క్ష‌ణ‌మైన‌ స్టార్ అని పదే పదే నిరూపించుకున్నాడు. తన అరంగేట్రం తర్వాత రణవీర్ సింగ్ లూటేరా, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా, గుండే, బాజీరావ్ మస్తానీ, దిల్ ధడక్నే దో, సింబా, గ‌ల్లీ బోయ్ లాంటి చిత్రాల‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అల‌రించాడు. నేడు అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు.


అప్ప‌ట్లో రణ్‌వీర్ సింగ్ తన అశ్లీల ఫోటోషూట్ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అలాంటి ధైర్యం అత‌డికి మాత్ర‌మే సాధ్యమైంది. మనీష్ మల్హోత్రా ఫ్యాషన్ షోలో అతడి పిక్చర్-పర్ఫెక్ట్ న‌గ్న ర్యాంప్ వాక్ అందరి దృష్టిని ఆకర్షించింది. అత‌డిని ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) బ్రాండ్ ఎండార్సర్ ఆఫ్ ది ఇయర్‌గా గౌరవించిన సంద‌ర్భాలున్నాయి.

అతడు చాలా కాలంగా ప‌దుల సంఖ్య‌లో బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేస్తూనే ఉన్నాడు. 41 బ్రాండ్‌లతో అత‌డు సంచ‌ల‌న అంబాసిడ‌ర్ గా నిలిచాడు. అయితే అత‌డు ఒక్కో ప్రకటనకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?

రణవీర్ సింగ్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 360 కోట్లు .. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ఇందులో భారీ పాత్ర పోషిస్తాయి. చింగ్స్ నుండి బింగో వరకు.. నివియా నుండి కోల్గేట్ వరకు.. ప్రతిచోటా ఉంటాడు. ర‌ణ‌వీర్ ఒక్కో ప్రకటనకు రూ. 3.5 - 4 కోట్ల మధ్య రుసుము వసూలు చేసారు. అందువల్ల‌ ఎండార్స్‌మెంట్‌ల కోసం అతడిని అత్యంత ఖరీదైన నటులలో ఒకరిగా మార్చారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కొన్ని ప‌రాజ‌యాల త‌ర్వాత ఆలియా భట్‌తో కలిసి కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'తో పెద్ద విజ‌యం అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఫ‌ర్హాన్ అఖ్త‌ర్ డాన్ 3లో న‌టిస్తున్నాడు. ర‌ణ‌వీర్ సింగ్ త‌దుప‌రి ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న 'జై హ‌నుమాన్'లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. కానీ దీనికి అధికారిక ధృవీక‌ర‌ణ రాలేదు.

Tags:    

Similar News