ఫేక్ పొలిటికల్ ప్రచార వీడియోపై స్టార్ హీరో ఫిర్యాదు
ఇప్పుడు అమీర్ ఖాన్ ఒక నిర్ధిష్ఠ పార్టీ తరపున రాజకీయ వ్యాఖ్యలు చేసారంటూ ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
భారతదేశంలో ఎన్నికల సీజన్ అంతకంతకు వేడి పెంచుతోంది. చాలా మంది సెలబ్రిటీలు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు అమీర్ ఖాన్ ఒక నిర్ధిష్ఠ పార్టీ తరపున రాజకీయ వ్యాఖ్యలు చేసారంటూ ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆన్‌లైన్‌లో షేర్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ `మోడీ ప్రభుత్వం 15 లక్షల జిమ్మిక్కులు` చేసిందని చెబుతున్న వీడియో ఆశ్చర్యపరిచింది.
తాజాగా దీనిని అమీర్ ఖాన్ ప్రతినిధి కొట్టి పారేసారు. ఆయన అధికారిక ప్రతినిధి ఇలా అన్నారు ``మిస్టర్ అమీర్ ఖాన్ తన 35 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీని ఆమోదించలేదు. గత ఎన్నికలలో ఎన్నికల సంఘం ప్రజా చైతన్య ప్రచారం నిర్వహించగా, ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రయత్నించారు`` అని తెలిపారు. అమీర్ ఖాన్ ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి అండగా ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ వైరల్ అవుతున్న వీడియో ఆందోళన కలిగించింది.. ఇది ఫేక్ వీడియో.. పూర్తిగా అవాస్తవమైనది. అతడు ఈ విషయాన్ని అధికారులకు నివేదించాడు. ఈ సమస్యపై ముంబై సైబర్ క్రైమ్ సెల్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసాం. భారతీయులంతా బయటకు వచ్చి ఓటు వేయాలని .. ఎన్నికల ప్రక్రియలో చురుకైన భాగం కావాలని మిస్టర్ ఖాన్ కోరి పాత వీడియోకి వైరల్ రాజకీయ ప్రకటన కూడా జోడించి ప్రచారం చేయడంతో దీనిని నెటిజనులు నమ్మారు. ఇది పదేళ్ల క్రితం అమీర్ `సత్యమేవ జయతే`కి హోస్టింగ్ చేసినప్పటి క్లిప్ అని కూడా వెల్లడైంది.
కెరీర్ మ్యాటర్‌కి వస్తే.. అమీర్ ఖాన్ చివరిసారిగా `లాల్ సింగ్ చద్దా` చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. ఇప్పుడు `తారే జమీన్ పర్` సీక్వెల్ `సితారే జమీన్ పర్` చిత్రీకరణలో అమీర్ బిజీ అయ్యారు. తదుపరి స్క్రిప్టులను కూడా అమీర్ ఖాన్ లాక్ చేసారని సమాచారం.