ఆ క్రేజీ కాంబినేషన్ అటకెక్కిందా?
టాలీవుడ్ లో ఆ స్టార్ హీరో వేగం గురించి చెప్పాల్సిన పనిలేదు. కొత్త వాళ్లను ప్రోత్సహించడంలో ముందుంటాడు
టాలీవుడ్ లో ఆ స్టార్ హీరో వేగం గురించి చెప్పాల్సిన పనిలేదు. కొత్త వాళ్లను ప్రోత్సహించడంలో ముందుంటాడు. వాళ్ల క్రియేటివిటీకి తగ్గట్టు తనని తాను మౌల్డ్ చేసుకుని ముందుకెళ్తాడు. కొత్త వాళ్లతో సక్సస్ లు అందుకుంటున్నాడా? అతడి సక్సెస్ ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిట్ ఇస్తే గనుక మళ్లీ అదే దర్శకుల్ని రిపీట్ చేస్తుంటాడు. అతడితో సీనియర్ దర్శకులు ఎవరు పనిచేయరు.
తానే ఇండస్ట్రీకి బోలెడంత మంది దర్శకుల్ని పరిచయం చేసాడు. ఈ విషయంలో ఆ హీరో మాత్రం గ్రేట్ అనే అనాలి. సీనియర్లతోనే పనిచేయాలి అనే నిబంధన తీసేసి తానే కొత్త వాళ్లను తెరపైకి తెచ్చి అలాంటి వారి విషయంలో గాడ్ లా నిలుస్తున్నాడు. ఇప్పటికే అలాంటి వారిని ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచ యం చేసాడు. బ్యాక్ గ్రౌండ్ లేని హీరో కాబట్టి ఆ కష్టాలు తెలిసిన నటుడు కాబట్టి ప్రతిభావంతుల్ని వెలికి తీసి ముందుకెళ్తున్నాడు.
అతడి సినిమాలంటే ఎలాగూ మినిమం వసూళ్లు ఉండనే ఉంటాయి. ఆ ధీమాతోనే కొత్త వారితో ధైర్యంగా రిస్క్ చేస్తుండాడు. ప్రస్తుతం ఆ హీరో చేతిలో రెండు..మూడు కమిట్ మెంట్లు ఉన్నాయి. ఇప్పటికే కాల్షీట్లు కేటాయింపు కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఓ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ అప్ డేట్ వైరల్ అవు తోంది. ఓ తమిళ డైరెక్టర్ తో ఇటీవలే ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఇప్పుడా సినిమా సంగతేంటి? అని అరా తీస్తే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిసింది.
బడ్జెట్ కారణంగా ఆ సినిమా రద్దు చేసినట్లు సమాచారం. ఇది నిజమైతే షాకింగ్ అనే అనాలి. ఆ హీరోని నమ్మి నిర్మాతలు ఎంతైనా ఖర్చు చేస్తారు. ఇప్పటివరకూ బడ్జెట్ కారణంగా ఆ హీరో సినిమాలు ఆగిపోయిం ది అనే నెగిటివ్ ఎక్కడా లేదు. తొలిసారి బడ్జెట్ లేక సినిమా ఆగిపోయింది అన్న మాట వినిపిస్తుంది. మరి అసలు కారణం ఇదేనా? లేక క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏవైనా ఉన్నాయా? అన్నది తెలియాలి. ఎందుకంటే హీరో స్టోరీ పరంగానూ ఇన్వాల్వ్ అవుతుంటాడు. తనకు అనుగుణంగా స్టోరీ లేకపోతే చేయడు. మార్పు కోరింది తెలుగు నటుడైతే..సినిమా చేసేది తమిళ దర్శకుడు కాబట్టి ఆ రకమైన క్లాష్ కి అవకాశం ఉంది. మరి అసలి సంగతి బడ్జెట్ నా? ఈ రకమైన క్లాష్ అన్నది డౌటే.