కోటి టికెట్ల సేల్ క్లబ్‌లో చేరిన సంచలన చిత్రం
38వ రోజున స్ట్రీ 2 నెమ్మదించే సంకేతాలు అస్సలు కనిపించలేదు. ఆగస్ట్ 15న విడుదలైన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద అజేయమైన రోజువారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.
హారర్ కామెడీ 'స్ట్రీ 2' సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో బుక్ మై షోలో కోటి (10 మిలియన్లు) టికెట్ల అమ్మకాలతో రికార్డులు బ్రేక్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే....
శ్రద్ధా కపూర్-రాజ్‌కుమార్ రావ్ నటించిన స్ట్రీ 2 బాక్సాఫీస్ కలెక్షన్ 38వ రోజు రూ.600 కోట్ల క్లబ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికే ఖేల్ ఖేల్ మే, వేదా లాంటి పోటీ సినిమాలను స్ట్రీ 2 అధిగమించింది. ఇటీవల విడుదలైన కరీనా కపూర్ 'ది బకింగ్‌హామ్ మర్డర్స్' కూడా బాక్సాఫీస్ వద్ద తక్కువ ప్రభావాన్ని చూపింది. ఈ వారం రెండు కొత్త చిత్రాలు యుధ్రా, కహాన్ షురు కహాన్ ఖతం వచ్చాయి. కానీ స్త్రీ 2 ఆధిపత్యం చెలాయించింది.
38వ రోజున స్ట్రీ 2 నెమ్మదించే సంకేతాలు అస్సలు కనిపించలేదు. ఆగస్ట్ 15న విడుదలైన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద అజేయమైన రోజువారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. కొత్త సినిమాలు వచ్చి వెళుతున్నా కానీ, స్ట్రీ 2 దేశీయంగా రూ.598.15 కోట్లను అధిగమించింది. రూ.600 కోట్ల మార్కును దాటే ఎడ్జ్ లో ఉంది.
స్ట్రీ 2 భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా అవతరించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.810 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హృతిక్ రోషన్ దర్శకనిర్మాతలను ప్రశంసించారు. నిర్మాత దినేష్ విజన్, దర్శకుడు అమర్ కౌశిక్ , రచయిత నిరేన్ భట్ సహకారం, వారి ప్రయత్నాన్ని హృతిక్ ప్రశంసించారు. ప్రాజెక్ట్‌కు జీవం పోయడంలో వారి కృషిని మెచ్చుకున్నారు.
స్ట్రీ 2 అనేది భేడియా - ముంజ్యా వంటి హిట్‌లను అందించిన మడాక్ ఫిల్మ్స్ విస్తరిస్తున్న అతీంద్రియ విశ్వంలో భాగం. వరుణ్ ధావన్ అతిధి పాత్రతో అభిమానులు థ్రిల్ అయ్యారు. తదుపరి భాగం-స్త్రీ 3 లేదా భేదియా 2 గురించి ఊహాగానాలు ఇప్పటికే ఉన్నాయి. భేదియా 2 ప్రస్తుత నిర్మాణ స్థితిని బట్టి స్ట్రీ 3 కంటే ముందే థియేటర్లలోకి రావచ్చని రాజ్‌కుమార్ రావు ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
హృతిక్ రోషన్ ఇప్పటికే 'మీర్జాపూర్' చిత్రంలో కాలీన్ భయ్యా పాత్రను పోషించడానికి చర్చలు జరుపుతున్నట్లు పుకారు ఉంది. వెబ్ సిరీస్ లో పంకజ్ త్రిపాఠి నటించిన పాత్రలో హృతిక్ పెద్ద తెరపై కనిపిస్తారని గుసగుస ఉంది. అయితే ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
కొత్త మైలు రాయి:
ఇటీవల జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా షారుఖ్ ఖాన్ జవాన్ కలెక్షన్లను అధిగమించిన స్త్రీ2 ఇప్పుడు ఇది బుక్ మై షోలో 10 మిలియన్లకు పైగా టిక్కెట్ల విక్రయాలతో భారతీయ చిత్రాల ప్రత్యేక క్లబ్‌లో చేరింది. ఆగస్ట్ 15, 2024న విడుదలైన స్ట్రీ 2 ఏకంగా 38 రోజుల పాటు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సఫలమైంది.
బుక్‌మైషోలో మరో ఐదు భారతీయ సినిమాలు మాత్రమే 10 మిలియన్ల మార్క్‌ను దాటాయి. స్ట్రీ 2 ఇప్పుడు జాబితాలో చేరి, 10 మిలియన్ల(కోటి)కు పైగా టిక్కెట్ విక్రయాలతో ఆరవ స్థానాన్ని ఆక్రమించింది. 12.4 మిలియన్ల టికెట్ అమ్మకాలతో జవాన్ ఐదో స్థానంలో ఉంది. 10 మిలియన్ల టికెట్ సేల్ క్లబ్ పరిశీలిస్తే... వరుసగా 1. KGF చాప్టర్ 2: 17.1 మిలియన్ 2. బాహుబలి 2: ది కన్‌క్లూజన్: 16 మిలియన్ 3. RRR: 13.4 మిలియన్ 4. కల్కి 2898 AD: 13.14 మిలియన్ : 12.4 మిలియన్ 6. స్ట్రీ 2: 10 మిలియన్+ ..లతో రికార్డులకెక్కాయి.