స్త్రీ 2.. కల్కి లెక్కను మించిపోయేలా..

శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్ లో మ్యాడ్‌డాక్‌ ఫిలిమ్స్ నిర్మించిన హర్రర్ కామెడీ మూవీ స్త్రీ2.

Update: 2024-08-20 10:04 GMT

శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్ లో మ్యాడ్‌డాక్‌ ఫిలిమ్స్ నిర్మించిన హర్రర్ కామెడీ మూవీ స్త్రీ2. ఈ సినిమా ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. హిందీలో అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం లాంటి స్టార్ హీరోలకి పోటీగా స్త్రీ 2 చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే మొదటి రోజే కలెక్షన్స్ పరంగా స్త్రీ 2 టాప్ లో నిలిచింది. అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహం వేదా సినిమాలు కలెక్షన్స్ పరంగా స్త్రీ2 దరిదాపుల్లోకి కూడా లేవు.

ఏకంగా 60+ కోట్లకి పైగా మొదటి రోజు కలెక్షన్స్ స్త్రీ మూవీ అందుకుంది. వీకెండ్ సెలవులతో పాటు ఫెస్టివల్ కూడా కలిసి రావడంతో స్త్రీ సినిమాకి కలెక్షన్స్ పరంగా అడ్డే లేకుండా పోయింది. స్త్రీ2 మూవీ నాలుగు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఐదో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సాధించింది. దీంతో ఇప్పటి వరకు 242 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని స్త్రీ2 మూవీ సాధించింది. 50 కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకొని లాభాల బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ కల్కి 2898ఏడీ పేరు మీద ఉంది. కల్కి మూవీ లాంగ్ రన్ లో హిందీలో 295 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. అయితే స్త్రీ2 మూవీ ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చేయబోతోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీకెండ్ తర్వాత కూడా స్త్రీ2 చిత్రానికి సాలిడ్ కలెక్షన్స్ వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో హిందీలో కల్కి లాంగ్ రన్ గ్రాస్ కలెక్షన్స్ ని స్త్రీ2 బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే లాంగ్ రన్ లో స్త్రీ2 మూవీ 400-500 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే ఈ ఏడాది హిందీలో రిలీజ్ అయ్యి హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా స్త్రీ2 మూవీ నిలుస్తుంది. మ్యాడ్‌డాక్‌ ఫిలిమ్స్ బ్యానర్ లో హర్రర్ ఫ్రాంచైజ్ లో భాగంగా ఈ ఏడాది ముంజ్య మూవీ రిలీజ్ అయ్యి 100+ కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది.

ఇప్పుడు స్త్రీ2 కూడా ఈ సంస్థకి భారీ లాభాలని తీసుకొస్తుంది. ఇదే స్పీడ్ లో హర్రర్ కామెడీ ఫ్రాంచైజ్ లో మ్యాడ్‌డాక్‌ ఫిలిమ్స్ మరిన్ని సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. శ్రద్ధా కపూర్ కి కూడా చాలా రోజుల తర్వాత స్త్రీ2తో సాలిడ్ సక్సెస్ లభించిందని బిటౌన్ లో టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News