బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందిగా..!

బాలీవుడ్ లో స్త్రీ 2 సినిమా వసూళ్ల హంగామా ఒక రేంజ్ లో ఉంది. అక్కడ స్టార్ హీరోలను సైతం అవాక్కయ్యేలా ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది

Update: 2024-08-19 07:29 GMT

బాలీవుడ్ లో స్త్రీ 2 సినిమా వసూళ్ల హంగామా ఒక రేంజ్ లో ఉంది. అక్కడ స్టార్ హీరోలను సైతం అవాక్కయ్యేలా ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది. శద్ధ కపూర్, రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ లో నటించిన స్త్రీ 2 సినిమా అమర్ కౌశిక్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మీద ముందు నుంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. పెయిడ్ ప్రీమియర్స్ తోనే సినిమా 9.40 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. ఇక సినిమా ఫస్ట్ డే 55 కోట్లు రెండో రోజు 35 కోట్లు మూడవ రోజు 45 కోట్లతో వసూళ్ల పరంగా దూసుకెళ్తుంది. ఫ్రై డే టూ సండే 3 రోజుల్లో సినిమా 150 కోట్లకు దగ్గరగా వసూళ్లు రాబట్టింది.

స్త్రీ 2 సినిమాను బాలీవుడ్ ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక థ్రిల్లర్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం బాలీవుడ్ మేకర్స్ ని సైతం సర్ ప్రైజ్ చేస్తుంది. ఓ పక్క బాలీవుడ్ బడా స్టార్స్ కూడా బాక్సఫీస్ దగ్గర తమ సత్తా చాటలేకపోతున్నారు. కానీ అనూహ్యంగా స్త్రీ 2 పైన ఆడియన్స్ సూపర్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. స్త్రీ 2 సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువే కానీ ఈ సినిమా వసూళ్లు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి.

చూస్తుంటే సినిమా మరో రెండు రోజుల్లో 200 కోట్లు రాబట్టేలా ఉంది. లాంగ్ రన్ లో ఎవరు ఊహించని విధంగా స్త్రీ 2 కలెక్షన్స్ ఉండేలా ఉంది. ఈమధ్య బాలీవుడ్ మీద సౌత్ సినిమాల హవా కొనసాగిస్తుండగా బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా డైలమాలో పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఐతే స్త్రీ 2 వారికి మంచి జోష్ ఇస్తుంది. కరెక్ట్ సినిమా పడితే బాలీవుడ్ ఆడియన్స్ ఎలా దాన్ని ఆదరిస్తారన్నది స్త్రీ 2 చూస్తే అర్ధమవుతుంది.

శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావు కలిసి చేసిన ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవ్వడం బాలీవుడ్ మేకర్స్ అందరికీ మంచి జోష్ ఇచ్చింది. కంటెంట్ ఉన్న సినిమా ఎక్కడైనా ఆడుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ రేంజ్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది. స్త్రీ 2 సక్సెస్ బాలీవుడ్ లో అలాంటి సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు మంచి ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యింది. ఐతే పోటీగా పూరీ రామ్ డబుల్ ఇస్మార్ట్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

Tags:    

Similar News