జాబ్ అడిగితే వాళ్లంతా నన్ను చూసి నవ్వారు!
నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.
సీనియర్ నటుడు `శుభలేఖ` సుధాకర్ గురించి పరిచయం అవసరం లేదు. చలన చిత్ర పరిశ్రమలో సుదీర్ఘమైన కెరియర్ ఆయన సొంతం. అప్పటి శుభలేఖ నుంచి మొన్నటి సరిపోదా శనివారం వరకూ ఎన్నో చిత్రాల్లో నటించారు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. వైవిథ్యమై పాత్రల్లో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ప్రత్యేకంగా` శివ` సినిమాతో ఆయనకు ఎంతో పేరు వచ్చింది.
బుల్లి తెర సీరియల్స్ లో సైతం తనదైన మార్క్ వేసారు. అలాగే గాయని శైలజ ఆయన సతీమణి అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధాకర్ ఓ సారిగత జీవితంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే...` చాలా సినిమాల్లో నటించిన తరువాత కూడా నేను మొదటి పనిచేసిన హోటల్ కి వెళ్లి మళ్లీ జాబ్ ఇవ్వమని అడిగితే నవ్వారు. అప్పుడు పెద్దగా అవకాశాలు లేని సమయం అది.
చిన్న చిన్న బిజినెస్ లు చేసుకుంటున్న నా పాత మిత్రులను కూడా పని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంత ఇబ్బంది పడుతున్నా మేము బాలూగారిని సాయం అడగలేదు. ఒకవేళ ఆయన అడిగితే మేము నొచ్చుకుంటామని ఆయన అడగకపోయి ఉండొచ్చు. ఒకసారి చేయి చాచితే అది అలవాటై పోతుంది. అందువలన ఎప్పటికీ అలాంటి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాము.
ఆ పరిస్థితుల్లోనే టెలివిజన్ వైపు నుంచి అవకాశాలు వచ్చాయి. అలా టెలివిజన్ అనేది ఆదుకోవడం వలన నా జీవితం గుట్టుగా సాగుతూ వెళ్లింది. నాలాంటి ఎంతోమందిని టెలివిజన్ ఆదుకుంది. అందువలన టెలివిజన్ కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను` అని అన్నారు.