'సలార్' గురించి సుధాకర్ చెప్పడం హైలైట్!
సినిమా లో అత్యంత కీలకమైన ఆ వాయిస్ ఓవర్ ను ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శుభలేక సుధాకర్ చెప్పబోతున్నారట.
తెలుగు ప్రేక్షకుల తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'సలార్'. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత చేస్తున్న సినిమా సలార్ సిరీస్. మరి కొన్ని వారాల్లో సలార్ సినిమా మొదటి ఛాప్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. సలార్ సినిమా గురించిన ఒక్కో అప్డేట్ ప్రస్తుతం సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
సలార్ సినిమా లో ప్రభాస్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు అనేది మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. సినిమా గురించి ఏ చిన్న విషయం అయినా కూడా అంచనాలు ఆకాశానికి పెంచేలా చేస్తున్నాయి. తాజాగా సలార్ సినిమా లో ఉండే ఒక వాయిస్ ఓవర్ సినిమా స్థాయిని పెంచడం తో పాటు హీరో పాత్రను చాలా విభిన్నంగా చూపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
సాధారణంగా సినిమా ఆరంభం లో హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. కానీ సలార్ సినిమా లో మాత్రం హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ సినిమా లో పలు చోట్ల ఒక వాయిస్ ఓవర్ తో అద్భుతమైన పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయట. ఆ డైలాగ్స్ వచ్చినప్పుడు కచ్చితంగా ఫ్యాన్స్ కి కిక్ ఎక్కినట్లు అనిపిస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
సినిమా లో అత్యంత కీలకమైన ఆ వాయిస్ ఓవర్ ను ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శుభలేక సుధాకర్ చెప్పబోతున్నారట. ఆయన గొంతు లో ఒక విభిన్నమైన పవర్ ఉంది. సింపుల్ గా కాకుండా విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో శుభలేక సుధాకర్ తో వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి సినిమా లో సలార్ పాత్ర గురించి శుభలేక సుధాకర్ చెప్పే డైలాగ్స్ హైలైట్ గా ఉంటాయట.