గోపిచంద్ - సన్నీ డియోల్.. గట్టి ప్లానే..

కథ నచ్చడంతో సన్నీ డియోల్ కూడా సౌత్ లో మార్కెట్ పెరుగుతుందని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

Update: 2023-12-19 04:37 GMT

సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని సినిమా ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రెండు భాషలలో ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. రవితేజతో అనుకున్న కథని గోపీచంద్ కొద్దిగా మార్పులు చేసి సన్నీ డియోల్ కి వినిపించి ఒకే చేసుకున్నారంట. కథ నచ్చడంతో సన్నీ డియోల్ కూడా సౌత్ లో మార్కెట్ పెరుగుతుందని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

త్వరలో ఈ సినిమా ప్రకటన అఫీషియల్ గా రాబోతోందని వినికిడి. ఇదిలా ఉంటే ఇప్పటికే గోపీచంద్ మలినేని ఈ చిత్రం కోసం గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. స్క్రిప్ట్ లో మార్పులు చేయడంతో పాటు హిందీ వెర్షన్ కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ని హిందీతో పాటు తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

దానికి తగ్గట్లుగానే క్యాస్టింగ్ సెలక్షన్ చేస్తున్నారంట. తెలుగు, హిందీ భాషలకి సంబందించిన ఆర్టిస్ట్స్ ని కీలక పాత్రల కోసం ఎంపిక చేయబోతున్నారంట. దీని ద్వారా తెలుగు ప్రేక్షకులకి భాగా రీచ్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే టెక్నికల్ టీం మొత్తాన్ని కూడా సౌత్ నుంచి తీసుకునే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. రవితేజతో ప్లాన్ చేసిన కూడా బడ్జెట్ వంద కోట్లు దాటిపోయిందంట. అయితే రవితేజ మార్కెట్ ప్రస్తుతం అంత లేకపోవడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఇప్పుడు అదే కథని సన్నీ డియోల్ కి గోపీచంద్ వినిపించాడు. నేటివిటీ కూడా హిందీ, తెలుగుకి కనెక్ట్ అయ్యే విధంగా స్టొరీలో మార్పులు చేస్తున్నారంట.

ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా, క్రిష్, గౌతమ్ తిన్ననూరి, శైలేష్ కొలను లాంటి యంగ్ డైరెక్టర్స్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని ఒక మాస్ కమర్షియల్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ఈ మూవీ అతనికి ఎలాంటి సక్సెస్ అందిస్తుంది అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News