ఈ ఒక్క మాటతో సన్నీ దేవత అయ్యింది..!
తాజాగా మరోసారి సన్నీ లియోన్ మంచి మనసుతో వార్తల్లో నిలిచింది. తన వద్ద పని చేసే కుటుంబానికి చెందిన చిన్నారి తప్పిపోయింది
శృంగార తారగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగి ఆ జోనర్ లో రికార్డులు సైతం దక్కించుకున్న సన్నీ లియోన్ ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. పూర్తిగా గతంను వదిలేసి వర్తమానంలోనే బతికేస్తోంది. హిందీ సినిమాలతో పాటు సౌత్ లో కూడా ఈమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
పెళ్లి తర్వాత సాధారణంగా పిల్లలను దత్తత తీసుకునేందుకు సెలబ్రిటీలు ఆసక్తి చూపించరు. కానీ సన్నీ లియోన్ దంపతులు తమ మంచి మనసును చాటుకున్నారు. అమ్మాయిని దత్తత తీసుకోవడం ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అంతే కాకుండా ఆమె చేసిన చాలా పనులు ఆమె గురించి ప్రశంసలు కురిపించే విధంగా నిలిచాయి.
తాజాగా మరోసారి సన్నీ లియోన్ మంచి మనసుతో వార్తల్లో నిలిచింది. తన వద్ద పని చేసే కుటుంబానికి చెందిన చిన్నారి తప్పిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా ద్వారా కూడా పాప ఫోటోను షేర్ చేసి వెతుకుతున్నారు.
ఆ ఫోటోను సన్నీ లియోన్ కూడా షేర్ చేసి పోలీసు ఉన్నతాధికారులను ట్యాగ్ చేయడంతో పాటు, పాప ఆచూకి చెప్పిన వారికి అదనంగా రూ.50 వేలు ఇస్తానంటూ ప్రకటించింది. సొంతంగా 50 వేలు ఇస్తానంటూ సన్నీ లియోన్ ప్రకటించడం ద్వారా దేవత అయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నాడు.
మంచి మనసుతో సన్నీ లియోన్ తన కోసం పని చేసే వారికోసం డబ్బు లెక్క చేయకుండా ముందుకు వచ్చిన సన్నీ లియోన్ గొప్ప మనసుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సన్నీ లియోన్ సినిమాల్లో హాట్ గా కనిపించినా కూడా నిజ జీవితంలో మాత్రం చాలా సాఫ్ట్ అని మళ్లీ నిరూపితం అయింది.