ఆయ‌న‌లా మిగ‌తా వాళ్లు ఎందుకు ఓపెన్ అవ్వ‌రు?

స్టార్ హీరోల పారితోషికాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్కో స్టార్ ఒక్కో సినిమాకి కోట్లలో అంద‌కుంటారు

Update: 2023-09-06 05:46 GMT

స్టార్ హీరోల పారితోషికాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్కో స్టార్ ఒక్కో సినిమాకి కోట్లలో అంద‌కుంటారు. కానీ ఆ కోట్ల లెక్క‌లు ఎంత‌? అన్న‌ది అధికారికంగా ఎప్పుడూ తెలియ‌దు. ఐటీ రిట‌ర్న్ ల మాత్రం ప్ర‌తీ ఏడాది క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లిస్తారు. అన్ని ప‌రిశ్ర‌మ‌ల పారితోషికాల లెక్క‌లు ఎప్పుడూ హైడ్ అవుతూనే ఉంటాయి. అయితే ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 'జైల‌ర్' సినిమాకి గానూ ఎంత తీసుకున్నారు అన్న‌ది తెలిసిందే.

రిలీజ్ కి ముందు 100 కోట్లు..రిలీజ్ అయి హిట్ అయిన త‌ర్వాత లాభాల్లో వాటా 110 కోట్లు అందుకున్నారు. మొత్తంగా జైల‌ర్ కి ర‌జ‌నీ అందుకున్న పారితోషికం 210 కోట్లు. అందులో ట్యాక్స్ లు..ఇత‌ర క‌టింగ్ లు పోతే ఇంకా త‌క్కువ‌గా ఉంటుంది ఆ లెక్క‌. లాభాల్లో వాటిని నిర్మాత క‌ళానిధి మార‌న్ మీడియాకి చెప్పి మ‌రి ఆ ప‌నిచేసారు. చెక్ అందిస్తోన్న ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. మ‌రి ఇలా మిగ‌తా హీరోల విష‌యంలో ఎందుకు జ‌ర‌గ‌డం లేదు.

సినిమా బిజినెస్ లెక్క‌లు...ఆ సినిమాకి అయిన ఖర్చు ఇలా ప్ర‌తీది నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెబుతారు. కానీ ఏ హీరో పారితోషికం అందుకున్నాడు? అన్న‌ది మాత్రం ఎక్క‌డా లీక్ అవ్వ‌దు. అంత అందుకున్నాడు..ఇంత అందుకున్నాడు? అని మీడియాలో ప్ర‌చారం త‌ప్ప ఎంత అందుకున్నారు? అన్న‌ది అందుకున్న వాళ్ల‌కే తెలుస్తుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం వారాహి యాత్ర‌లో భాగంగా సినిమాలు చేస్తే గ‌నుక రోజుకు 2 కోట్లు తీసుకుంటా అన్నారు. అంటే నెలంతా ప‌నిచేస్తే 60 కోట్లు అందుకుంటారు.

ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ఎక్కువ‌గా నే సినిమాలు కమిట్ అవుతున్నారు కాబ‌ట్టి ఆయ‌న కూడా అడ్వాన్సుల రూపంలో బాగానే అందుకున్నారు. ఇంకా ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది స్టార్ హీరోలున్నారు. వాళ్ల సినిమాలు హిట్ అయితే వంద‌ల కోట్లు వ‌సూళ్ల రూపంలో వ‌స్తాయి. మ‌రి ఆ స్టార్ హీరోలు ఒక్కో సినిమాకి ఎంత ఛార్జ్ చేస్తున్న‌ట్లు? ఒక‌వేళ ప్లాప్ అయితే ఎంత తిరిగి వాప‌స్ ఇస్తున్నారు? వంటి వివ‌రాలు కూడా అధికారికం అయితే బాగుంటుంద‌ని ప‌లువురు నెటి జ‌నులు సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుతున్నారు. నిజాయితీగా తాము ఎంత సంపాదించారో చెప్ప‌డంలో త‌ప్పేముంది అంటున్నారు. ర‌జ‌నీకాంత్ లా మీడియా ముందు చెక్కులు అందిస్తే తప్పేంటి అంటున్నారు.

Tags:    

Similar News