సురేందర్ రెడ్డి.. ముందు ఆ హీరో తర్వాతే పవన్
పవన్ ఫ్రీ అయ్యేలోగా వెంకీతో సినిమా పూర్తి చేస్తారట. ప్రస్తుతం స్క్రిప్టింగ్ పనులు జరుగుతున్నాయట. వెంకటేశ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందట.
అఖిల్ ఏజెంట్ భారీ డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేశారు దర్శకుడు సురేందర్ రెడ్డి. రీసెంట్గా ఈ చిత్రం కోసం ఓ ఆఫీస్ ఓపెనింగ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి లైనప్ మారింది. పవన్ కళ్యాణ్ సినిమా కన్నా ముందు మరో హీరోతో సినిమా చేయబోతున్నట్లు తెలిసింది.
వివరాళ్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ , సురేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ లో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ఈ సినిమా ప్రకటించినా పవన్ లైనప్ బిజీ కారణంగా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇటీవలే సురేంద్ర ఈ సినిమాకు సంబంధించిన పనులను షురూ చేశారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలిసింది.
ఎందుకంటే ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన పూర్తి చేయాల్సిన సినిమాల లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. అవన్నీ ఎలక్షన్స్ తర్వాతే పూర్తి కానున్నాయి. అందుకే ఇప్పుడు సురేందర్ లైనప్‌లోకి విక్టరీ వెంకటేశ్ వచ్చి చేరారని తెలిసింది.
పవన్ ఫ్రీ అయ్యేలోగా వెంకీతో సినిమా పూర్తి చేస్తారట. ప్రస్తుతం స్క్రిప్టింగ్ పనులు జరుగుతున్నాయట. వెంకటేశ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందట. భూపతిరాజా ఈ చిత్రానికి కథ అందించనున్నారని తెలిసింది.
కాగా, వెంకటేశ్ కూడా కొంత కాలంగా వరుస హిట్లను అందుకుంటున్నారు. 'నారప్ప', 'దృశ్యం 2', 'ఎఫ్ 3' సినిమాలతో ఆయన దూకుడు కొనసాగిస్తున్నారు. త్వరలో 'సైంధవ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీని తర్వాతే ఇప్పుడు ఆయన సురేందర్‌తో చేతులు కలిపారని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందట.
సురేందర్ రెడ్డి మేకింగ్ ఎంతో స్టైలీష్ గా ఉంటుంది. యాక్షన్ సీన్స్‌పై ఆయన మార్క్ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన 'సైరా', 'ఏజెంట్' వంటి వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొన్నారు. దీంతో ఇప్పుడు వెంకటేశ్‌తో చేయబోయే సినిమా ఆయనకు ఎంతో కీలకంగా మారింది.