బన్నీపై కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు
"నేను సోషల్ మీడియలో ఏదైనా చూడటానికి ఇష్టపడను. నేను పెద్దగా ఫాలో అవ్వను. ఇవాళ ఉదయం నాకు ఎవరో పంపించారు.. నేను బన్నీని ఏదో అన్నట్లుగా.
''నీ ఇంట్లో నువ్వు ఎగురు, డ్యాన్స్ చెయ్యి, ఏమైనా చెయ్యి.. కానీ బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలి కదా'' అంటూ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు మాట్లాడిన వీడియో నిన్నంతా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో, అల్లు అర్జున్ ను ఉద్దేశించే సురేష్ బాబు ఈ కామెంట్స్ చేసారంటూ యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియోని వాడుకుంటూ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేసారు. ఈ విషయం సురేష్ బాబు వరకూ చేరడంతో, తాజాగా మరో ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలపై స్పందించారు. బన్నీని అనలేదని, తాను అన్న మాటల ఉద్దేశ్యం వేరని వివరణ ఇచ్చారు.
"నేను సోషల్ మీడియలో ఏదైనా చూడటానికి ఇష్టపడను. నేను పెద్దగా ఫాలో అవ్వను. ఇవాళ ఉదయం నాకు ఎవరో పంపించారు.. నేను బన్నీని ఏదో అన్నట్లుగా. బన్నీ నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. నా కొడుకు ఫ్రెండ్ వాడు. నేను అతన్ని ఏదైనా ఎందుకు అంటాను?. కానీ అలా రాశారు. చాలా రాంగ్ అది. నేను అన్నానని డైరెక్ట్‌గా చెప్పలేదు.. కావొచ్చు అని రాశారు. ఎందుకలా రాయడం?" అంటూ సురేష్ బాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియోలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సురేష్ బాబు ఏదో బన్నీని అన్నట్లుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని యాంటీ ఫ్యాన్స్ కు కౌంటర్ ఇస్తున్నారు.
ఇకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ తర్వాత సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనలు ఎక్కడైనా, ఎప్పుడైనా జరగొచ్చు. ఈవెంట్స్ ఎక్కడ చేసినా జనాలు ఎక్కువగా వస్తున్నారనే దానిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. స్టార్లు, పబ్లిక్ ఇద్దరూ కంట్రోల్ చేసుకోవాలని.. ఇండస్ట్రీ దీనిపై అవగాహన కలిగి ఉండి క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈవెంట్స్ కు వెళ్లే జనాలు అప్రమత్తంగా ఉండాలని, అలానే క్రౌడ్ ను కంట్రోల్ చేసే వాళ్లు బెటర్ గా కంట్రోల్ చేయాలని అన్నారు. పోలీసులు, లోకల్ సెక్యూరిటీ.. ఇలా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పబ్లిక్ ప్లేస్ లకు వెళ్లేటప్పుడు బిహేవియర్ పాటర్న్ కూడా కొంచం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పిల్లలకు స్కూళ్లు, కాలేజీల నుంచే సివిక్ సెన్స్ నేర్పించాలని అభిప్రాయ పడ్డారు.
ఇక తాజా ఇంటర్వ్యూలో పబ్లిక్ ప్లేస్ లో మనం బాధ్యతగా ఎలా ప్రవర్తించాలి? అనే దాని గురించి సురేష్ బాబు మరోసారి వివరించారు. ''రీసెంట్ గా జపాన్ వెళ్తే పబ్లిక్ ప్రాపర్టీని ఎంతగా రెస్పెక్ట్ చేస్తారనేది చూసా. ఇంట్లో ఎలా ఉంటారో తెలియదు కానీ, పబ్లిక్ లో మాత్రం వాళ్ళ బిహేవియర్ అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది నేర్చుకోవాలి. ట్రైన్ లో వెళ్తే గోల గోలగా అరవడం.. ఫోన్ లో అరుస్తూ మాట్లాడటం.. సినిమా చూస్తున్నప్పుడు పెద్దగా ఫోన్ లో మాట్లాడటం.. ఏంటి అసలు ఇవన్నీ?. పబ్లిక్ లో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు తోసుకుంటారని మనకి తెలుసు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి''
''యువతరానికి అలాంటి సివిక్ సెన్స్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పాను. కానీ నేనేదో అల్లు అర్జున్ లేదా రానా.. ఇలాంటి వాళ్ళని అన్నట్లుగా రాశాను. వీళ్ళు లైఫ్ లో చాలా అచీవ్ చేసారు. బన్నీ, రానా, చైతన్య, నాని.. వీళ్లంతా 30 - 40 ఏళ్లకే చాలా సాధించారు. కానీ నేను చెప్పినదాన్ని డిస్ట్రాక్ట్ చేసి రాస్తున్నారు. నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. మనం పాజిటివ్ గా మాట్లాడుకోవాలి.. ఎలా ముందుకు సాగాలనేది మాట్లాడుకోవాలి. ప్రతీ రోజు ఉదయాన్నే లేచిన వెంటనే మన లైఫ్, ఫ్యామిలీ లైఫ్ బెటర్ గా ఉండాలంటే ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలి'' అని సురేష్ బాబు అన్నారు.
అలానే పుష్ప 2' సినిమా సక్సెస్ గురించి సురేష్ బాబు మాట్లాడుతూ.. ''పుష్ప సినిమా నార్త్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఒక తెలుగు డబ్బింగ్ సినిమా బాంబేలో అంత పెద్ద హిట్టైంది. అక్కడ అంతలా ఎందుకు ఆడుతోందంటే.. దానికి కారణం అల్లు అర్జున్ చాలా బాగా నటించాడు. జనాలు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో అలాంటి సినిమాని ఇచ్చాడు అంతే. హిందీ కూడా మాట్లాడటం రాని తెలుగు హీరో నటించిన డబ్బింగ్ సినిమా హిందీలో నెం.1 మూవీ అయిపోయిందంటే.. అతను ఎలాంటి గొప్ప విషయాన్ని సాధించాడనేది అర్థం చేసుకోవాలి. ఇతర భాషలలో, అది కూడా ఆల్ ఇండియాలో సూపర్ హిట్ సాధించాలంటే.. అది యాక్టింగ్ టాలెంట్ ఉంటేనే సాధ్యపడుతుంది'' అని చెప్పుకొచ్చారు.