సురేష్ ప్రొడక్షన్స్ @60 ఏళ్లు
ఈ ఏడాది తో ఆ సంస్థ 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ ట్విటర్లో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 1964 లో సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభమైంది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. మూవీ మోఘల్ డా..రామానాయుడు స్థాపించిన నిర్మాణ సంస్థ కొన్ని దశాబ్ధాలుగా పరిశ్రమలో సేవలందిస్తోంది. పెద్ద కుమారుడు సురేష్ పేరిట స్థాపించిన సంస్థలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు రూపొందాయి. ఆ సంస్థ ద్వారా ఎంతో మంది నటీనటులు..దర్శక-రచయితలు పరిచయం అయ్యారు. దేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించిన ఏకైక భారతీయ నిర్మాణ సంస్థగానూ రికార్డు సృష్టించింది.
ఈ ఏడాది తో ఆ సంస్థ 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ ట్విటర్లో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 1964 లో సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభమైంది. తొలిసారి నటసార్వభౌమ ఎన్టీఆర్ హీరోగా 'రాముడు భీముడు' చిత్ర నిర్మాణం జరిగింది. తాపి చాణుక్య ఆ చిత్రానికి దర్శకత్వం వహించగా నిర్మాతగా రామానాయుడు పేరు తొలిసారి స్క్రీన్ మీద పడింది. ఆ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది.
తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాతగా రామానాయుడు పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత ఆ సంస్థ అప్పటితరం హీరోలందరితో ఎన్నో సినిమాలు నిర్మించింది. అటుపై తర్వాత తరం..నేటి జనరేషన్ నటులతోనూ కలిసి పనిచేస్తుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ 60 దశాబ్ధాలుగా సినిమాలు నిర్మిస్తూనే ఉంది. రామానాయుడు చివరి శ్వాస వరకూ సినిమాలు నిర్మించి నిర్మాతగా రికార్డు సృష్టించారు.
దేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాతగానూ చరిత్ర సృష్టించారు. రామానాయుడు యాక్టివ్ గా ఉన్న రోజుల్లోనే ఆ సంస్థ బాధ్యతలు పెద్ద కుమారుడు సురేష్ కి అప్పగించారు. అయినా వెనుకుండి కీలక బాధ్యతలు చూసుకునేవారు. రెండవ కుమారుడు వెంకేటేష్ హీరోగా ఎన్నో సినిమాలు అదే నిర్మాణ సంస్థలో జరిగాయి. ఆయన హీరోగా పరిచయమైంది కూడా సొంత నిర్మాణ సంస్థలోనే. 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థతో అనుబంధం ఉన్నవారంతో విషెస్ తెలియజేస్తున్నారు.