కంగువా, బాహుబలి.. సూర్య కామెంట్స్ ఇలా

పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఆ సినిమా రిలీజ్ కు సిద్దమవుతోంది.

Update: 2024-10-23 22:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ప్రస్తుతం కంగువా మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఆ సినిమా రిలీజ్ కు సిద్దమవుతోంది. నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సిరుతై శివ దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటించారు. బీటౌన్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న కంగువాపై సినీ ప్రియులతో పాటు సూర్య ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అదే సమయంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ అంతా ఫుల్ గా ప్రమోట్ చేస్తోంది. అనేక ఇంటర్వ్యూలు ఇచ్చి సందడి చేస్తోంది. సూర్య అయితే నార్త్ టు సౌత్.. తిరుగుతూ ఓ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హాలీవుడ్‌ రేంజ్‌ మూవీ చేయాలని తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, అది కంగువాతో తీరిపోయిందని సూర్య చెప్పారు. బ్రేవ్‌ హార్ట్‌, లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ వంటి సినిమాలు చూసి చాలా సార్లు షాక్ అయ్యానని తెలిపారు. అలాంటి మూవీస్ మనం ఎప్పుడు తీస్తామనుకునే సమయంలో డైరెక్టర్ శివ.. కంగువా కథతో అప్రోచ్ అయ్యారని అన్నారు.

ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో.. కోలీవుడ్‌ లో కంగువా బ్లాక్ బస్టర్ హిట్స్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహా చిత్రం అవుతుందని సూర్య అభిప్రాయపడ్డారు. అయితే కోలీవుడ్ లో ఇప్పటి వరకు కంగువా రేంజ్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కలేదని చెప్పాలి. అందుకే కంగువా.. కోలీవుడ్ బాహుబలి, తరహా మూవీ అవుతుందని సూర్య అన్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం సూర్య కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకే బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో కంగువాను సూర్య పోల్చుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అది ఆడియన్స్ లో మూవీపై ఓవర్ హైప్ కు కారణవుతుందని, కాబట్టి మేకర్స్ కచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే హిట్ అవ్వడం ఖాయమని చెబుతున్నారు. మరి కంగువా మూవీ సూర్య అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News