44 కూడా పూర్త‌యింది..ఇక 45 లోకి దూకడ‌మే!

ఇక సూర్య 45వ ప్రాజెక్ట్ కూడా ప‌ట్టాలెక్కిస్తారేమో చూడాలి. ఇప్ప‌టికే ఆర్. జె బాలాజీతో ఓ సినిమా చేయాల‌ని సూర్య నిర్ణ‌యించుకున్నాడు.

Update: 2024-10-08 09:24 GMT

సూర్య ఇప్ప‌టికే 43వ చిత్రం 'కంగువ' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ సినిమా సెట్స్ లో ఉండ‌గానే 44వ చిత్రం కార్తీక్ సుబ్బ‌రాజ్ తో లాక్ చేసాడు. అటుపై వెంటనే షూటింగ్ కూడా ప్రారంభించాడు. తాజాగా ఈసినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. అండ‌మాన్ లో షూటింగ్ మొద‌లు పెట్టిన యూనిట్ చెన్నై షెడ్యూల్తో ముగించింది. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగానే పూర్తి చేసారు. కేవ‌లం నాలుగు నెలల్లోనూ షూట్ పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది.

జూన్ లో ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. సెప్టెంబ‌క‌ల్లా షూట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ విష‌యాన్ని సూర్య స్వ‌యంగా తెలిపారు. ఈ చిత్రం నాకు జీవితంలో మ‌ర్చిపోలేని జ్ఞాప‌కాల‌నుఅందించింది. కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేసినందుకు సంతోషంగానూ ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎన్నో అంద‌మైన ప్రాంతాల్లో షూట్ చేసాం. షూట్ అంతా ఆనందంగా జ‌రిగింది. దీనికోసం ఎంతో మంది ప్ర‌తిభావంతులు ప‌నిచేసారు' అని అన్నారు.

ల‌వ్ అండ్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్లో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఈ నేప‌థ్యంలోనే షూటింగ్ వేగంగా పూర్త‌యింది. ఇక ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుద‌ల కానున్నాయి. న‌వంబ‌ర్ లో కంగువ‌ర రిలీజ్ అవుతుంది. 45వ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌లేదు. అన్ని ప‌నులు పూర్తి చేసి సంక్రాంతి కానుక‌గా బ‌రిలోకి దించే అవ‌కాశం ఉంది. చాలా కాలం త‌ర్వాత సూర్య నుంచి బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ అవ్వ‌డం విశేషం. 'కంగువ' షూటింగ్ పూర్తి చేయ‌డానికి మాత్రం చాలా స‌మ‌యం ప‌ట్టింది.

భారీ పీరియాడిక్ సినిమా కావ‌డంతో షూటింగ్ డిలే అయింది. ఇక సూర్య 45వ ప్రాజెక్ట్ కూడా ప‌ట్టాలెక్కిస్తారేమో చూడాలి. ఇప్ప‌టికే ఆర్. జె బాలాజీతో ఓ సినిమా చేయాల‌ని సూర్య నిర్ణ‌యించుకున్నాడు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్- వేల్స్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌డానికి ముందుకొస్తున్నాయి. స్టోరీ కూడా లాక్ అయిన‌ట్లు వినిపిస్తుంది. ఈ సినిమా అనంత‌రం వెంట్రీమార‌న్ తో 46వ చిత్రం ప‌ట్టాలెక్కుతుంది.

Tags:    

Similar News