సూర్య సేతుపతికి ప్రత్యామ్నాయం అవుతాడా?
ఆయన వేగం చూస్తుంటే! మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పోటీగా కనిపిస్తున్నాడు. సేతుపతి కి ప్రత్యామ్నాయంగానూ కనిపిస్తున్నాడు.
నటుడు కమ్ డైరెక్టర్ ఎస్. జె సూర్య జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగానే ఆయన జర్నీ ప్రారంభమైనా దర్శకుడిగా ఆయనకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. అయితే నటుడిగా సూర్య సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం అన్ని ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది. స్టార్ హీరోల చిత్రాల ప్రతి నాయకుడి పాత్రలతో సూర్య మెప్పిస్తున్న వైనం ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తుంది. కోలీవుడ్ లో ఏకంగా మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు.
ఆయన వేగం చూస్తుంటే! మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పోటీగా కనిపిస్తున్నాడు. సేతుపతి కి ప్రత్యామ్నాయంగానూ కనిపిస్తున్నాడు. సూర్య విలన్ గా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కొట్ల వసూళ్లని రాబడుతున్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన మార్క్ ఆంటోనీలో తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నారు. హీరో విశాల్ పాత్రకంటే సూర్య నెగిటివ్ రోల్ ఎక్కువగా ఫోకస్ అవుతుంది.
అంతకు ముందు తలపతి విజయ్ సినిమా 'మెర్శల్ ' ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. విజయ్ కెరీర్ లో అది భారీ విజయం సాధించింది. అలాగే 'శింబు' నటించిన 'మానాడు' లో.. శివ కార్తికేయన్ నటించిన 'డాన్'ల్లో విలన్ పాత్రలతో తనదైన ముద్ర వేసాడు.ఇక తెలుగు స్పైడర్ చిత్రంలోనూ సైకో పాత్ర తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఫలితం సంగతి పక్కనబెడితే విలన్ గా సూర్య నటనకి ఎవరైనా వావ్ అనాల్సిందే. ఆ రేంజ్ లో పెర్పార్మెన్స్ చేసాడు.
ఇలా సూర్య కెరీర్ లో ప్రతి నాయకుడి పాత్రలు అయనకి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. విజయ్ సేతుపతి కంటే ముందే జర్నీ మొదలైనా తనలో ప్రతిభ బయటపడటానికి సమయం పట్టిందంతే. తాజాగా సూర్య వేగం చూస్తుంటే సేతుపతి పోటీగా...ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు అన్న టాక్ కోలీవుడ్ లో మొదలైంది. భవిష్యత్ లో మక్కల్ సెల్వన్ కి సరైన పోటీ సూర్య నుంచే ఎదురవుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే సూర్యకి తెలుగులోనూ విలన్ అవకాశాలు వస్తున్నాయి. కింగ్ నాగార్జున 'నా సామి రంగ'లో విలన్ పాత్ర కి సూర్య పేరు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.