సూర్య 120 కోట్ల ప్రైవేట్ జెట్ కొన్నాడా?

కోలీవుడ్ స్టార్ సూర్య `కంగువ‌`తో పాన్ ఇండియాలో అల‌రించ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-08-23 11:29 GMT

కోలీవుడ్ స్టార్ సూర్య `కంగువ‌`తో పాన్ ఇండియాలో అల‌రించ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు అంచ‌నాల్ని అంత‌కంత‌కు రెట్టింపు చేస్తున్నాయి. సూర్య లుక్ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తీది హైలైట్ గానే క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాతో సూర్య మ‌రో భారీ విజ‌యం అందుకుంటాడ‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అంత‌లోనే సూర్య అభిమానుల్ని మ‌రో బ‌హుమ‌తితో అభిమానుల్ని స‌ర్ ప్రైచ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. సూర్య సొంతంగా ఓ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అత్యంత అనుకూలమైన డస్సాల్డ్ ఫాల్కర్ 2000 జెట్‌ను సూర్య కొనుగోలు చేసినట్లు నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆ జెట్ ధర రూ.120 కోట్లు అని, కొన్ని అత్యాధునిక సాంకేతికత, భద్రతా సౌకర్యాలు ఈజెట్ లో ఉన్నట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఈ త‌ర‌హా జెట్ లు కొంద‌రు క‌లిగి ఉన్నారు. ర‌జ‌నీకాంత్, విజ‌య్ లు సొంత విమానాలు క‌లిగి ఉన్నారు. అలాగే న‌య‌న‌తార కూడా ఓ జెట్ ని క‌లిగి ఉంది. ఇప్పుడు వాళ్ల స‌ర‌స‌న సూర్య చేరుతున్న‌ట్లు క‌నిఇస్తుంది. అయితే విష‌యాన్ని సూర్య క‌న్ప‌మ్ చేయాల్సి ఉంది.

అయితే సూర్య స‌న్నిహిత వ‌ర్గాల నుంచి మాత్రం ఆయ‌న ఎలాంటి జెట్ కొన‌లేద‌ని మ‌రో వార్త కూడా వైర‌ల్ అవుతుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో అస‌లు నిజం ఏంటి అన్న‌ది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం సూర్య హీరోగా కార్తీక్ సుబ్బ‌రాజ్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. న‌టుడిగా సూర్య‌కిది 44వ చిత్రం.

Tags:    

Similar News