నా కుమార్తెలకు లైంగిక చర్య గురించి వివరించాల్సిన అవసరం లేదు!
తాజాగా ఇటీవలే ఓ పాడ్ కాస్ట్ లో సె....క్స్ గురించి తన పిల్లలకు వివరించాల్సిన పనిలేదని..అందులో వారు పీహెచ్ డీ చేసారని వ్యాఖ్యానించింది
మాజీ విశ్వసుందరి కొన్ని రోజులుగా నెట్టింట హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సె....క్స్ అనే పదజాలం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు..ఆ పదం కారణంగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన వ్యతిరేకత గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఇటీవలే ఓ పాడ్ కాస్ట్ లో సె*క్స్ గురించి తన పిల్లలకు వివరించాల్సిన పనిలేదని..అందులో వారు పీహెచ్ డీ చేసారని వ్యాఖ్యానించింది. 'నేను నా కుమార్తెలకు లైంగిక చర్య గురించి వివరించాల్సిన అవసరం లేదు. వారు ఇప్పటికే పీహెచ్‌డీలు చేసారు' అని అంది.
అయితే ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేచింది. ఓ వినయోగదారుడు సుస్మితని ఉద్దేశించి ఇలా రాసుకొచ్చాడు. 'బాలీవుడ్ పిల్లలపై లైంగిక విద్య అనేది ఓ మార్కెంట్ గా మారిపోయింది. చట్ట విరుద్దమైనా దాని గురించి పదే పదే మాట్లాడి మరింత ప్రభావం చేస్తున్నారు. తద్వారా వాళ్లేదో గొప్ప పనిచేసినట్లు వాళ్లకు ప్రత్యేకమైన అవార్డులు అందిస్తున్నారన్నాడు.
మరో యూజర్ 'తరచుగా బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చుకునే సుస్మిత, తన కూతుళ్లకు సె*క్స్ గురించి నేర్పించడం హేయమైన చర్యంగా ఉంది' అని విమర్శించారు. అయితే ఈ విమర్శలు సుస్మిత దృష్టికి వెళ్లడంతో తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్దం చేసుకున్నారని అంది. 'నేను నా కుమార్తెలకు లైంగిక చర్య గురించి వివరించాల్సిన అవసరం లేదు. వారు ఇప్పటికే ఆ విషయం పట్ల చదువు ద్వారా అవగాహన కలిగి ఉన్నారు. నా చిన్న కుమార్తె జీవిశాస్త్రం చుదవుకుంది.
కాబట్టి ఆమెకు అందులో సాంకేతిక పదాలు బాగా తెలుసు. శరీరంలో వచ్చే మార్పుల గురించి ఆమెకు ఎంతో అవగాహన ఉంది. ఎన్నో పుస్తకాలు చదివింది. సె*క్స్ అనే అంశం గురించి అందరిపట్ల వీలైనంతగా అవగాహన తీసుకురావడంలో తప్పులేదు కదా. ఈ విషయంపై ప్రతీ ఒక్కరికి అవగాహన తప్పనిసరి' అని తెలిపింది.