మూడేళ్లగా మిస్ యూనివర్స్ సింగిల్ గానే!
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ప్రేమాయాణాలు..వాటి బ్రేకప్ స్టోరీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ప్రేమాయాణాలు..వాటి బ్రేకప్ స్టోరీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకూ సుస్మితాసేన్ ఖాతాలో 11 మంది తో డేటింగ్ చేసింది. ప్రస్తుతం ఆ 11 నెంబర్ కూడా వీగిపోయింది. మళ్లీ ఓల్డ్ బోయ్ ప్రెండ్ రోహ్మాన్ షానే మళ్లీ తెరపైకి తెస్తుంది? అన్న ప్రచారం కూడా సాగింది. కానీ ఇంతవరకూ అధికారికంగా ప్రకటించింది లేదు. అప్పుడప్పుడు జంటగా బయట మాత్రం కనిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సుస్మితాఖాన్ రిలేషన్ షిప్ పరోక్షంగా హిట్ ఇంచ్చింది. `నా జీవితంలో ఇప్పుడు ఏ పురుషుడు లేడు. మూడేళ్లగా సింగిల్ గానే ఉంటున్నా. ప్రేమ, బంధం అనే వాటి వెనుక పరిగెత్తే ఆలోచన కానీ, ఆసక్తికానీ రెండు లేవు. అంతకు ముందు ఒకరితో ఐదేళ్ల పాటు రిలేషన్ లో ఉన్నాను. ఆ బ్రేకప్ తర్వాత ఎంతో స్వేఛ్చగా జీవిస్తున్నాను. అలాగే నేనిప్పుడు పెళ్లి చేసుకుంటానంటే నా పిల్లలు కూడా ఒప్పుకోవడం లేదు.
ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని మా పెద్దమ్మాయిని అడిగితే అతడినే కాదు..ఎవర్నీ పెళ్లి చేసుకోవద్దు అని చెబుతుంది. వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నీకు నచ్చినట్లు నీ జీవితాన్ని గడుపు. పెళ్లి గురించి ఆలోచించాల్సిన పనేముందని ప్రశ్నిస్తుంది` అని తెలిపింది. పిల్లలు అంటే సుస్మితాసేన్ పేగు తెంచుకుని పుట్టిన వారు అనుకునేరు. ఆమె దత్తత తీసుకున్న పిల్లలు.
వీళ్లని సొంత పిల్లలుగా చూసుకుంటుంది. మంచి చదువులు చెప్పిస్తోంది. ఇక సుస్మితాసేన్ కెరీర్ సంగతి చూస్తే చాలా కాలం తర్వాత `తాలీ ` అనే వెబ్ సిరీస్ లో నటించి ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించి ఇండియానే ఆడించింది. ట్రాన్స్ జెండర్స్ హక్కుల కోసం పోరాడిన 'గౌరీ సావంత్' జీవితం ఆధారంగా తెరకెక్కిన సిరీస్ లో సుస్మితా సేన్ నట విశ్వరూపం చూపించింది. ఇండియా మొత్తం ఆమె గురించి మాట్లాకునే రేంజ్ లో నటించింది.