పాన్ ఇండియా చిత్రంలో స్వాతి!
ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఇందులో ఓ కీలక పాత్రకు కలర్స్ స్వాతిని ఎంపిక చేసారట.
యంగ్ హీరో నిఖిల్ హీరోగా పాన్ ఇండియాలో `స్వయంభు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ వార్ ఎపిక్ చిత్రంగా భరత్ కృష్ణమార్య తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కూడా పూర్తయింది. చోళ సామ్రాజ్యానికి సంబంధించిన కథ కావడంతో భారీ వార్ సన్నివేశాలున్నాయి. వందలాంది ..వేలాది మధ్య ఈ వార్ సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
వెండి తెరపై మరో బాహుబలిని చూస్తామన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసినిమా కోసం నిఖిల్ ప్రత్యేకంగా కత్తి యుద్దం, గుర్రపుస్వారీలో తర్పీదు పొందాడు. ఇందులో నిఖిల్ కి జోడీగా సంయుక్తా మీనన్, నభానటేష్ నటిస్తున్నారు. వాళ్లపైనా కీలక సన్నివేశాలున్నాయి. సినిమా కోసం వారు కూడా వార్ సన్నివేశాలకు సంబంధించి కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు కూడా చేరుకుంది.
ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఇందులో ఓ కీలక పాత్రకు కలర్స్ స్వాతిని ఎంపిక చేసారట. అమ్మడు ఇందులో ఓపవర్ ఫుల్ పాత్రలో కనిపించనుందట. చిత్రీకరణ ముగింపు దశలో స్వాతి పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఆ పాత్రకు ఓ కొత్త నటిని తీసుకోవాలనుకున్నారట. కానీ ఆ పాత్రకు స్వాతి కూడా సెట్ అవుతుందని భావించి అమెని ఎంపిక చేసినట్లు వినిపిస్తుంది.
అదే నిజమైతే స్వాతి ఎంట్రీ వెనుక నిఖిల్ ఉన్నట్లే . ఇద్దరు మంచి స్నేహితులు. గతంలో `కార్తికేయ` లో కలిసి నటించారు. ఈ నేపథ్యంలోనే స్వాతికి సినిమా ఛాన్స్ ఈజీగా వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆమె ఎంపికలో నిజమెంతో మేకర్స్ ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం స్వాతి సినిమాల్లో నటించలేదు. ఆమె సినిమాలు చేసి రెండేళ్లు అవుతుంది. మరి అవకాశాల రాక చేయలేదా? వచ్చి చేయలేదా? అన్నది తెలియదు గానీ `స్వయంభు` మాత్రం మంచి కంబ్యాక్ సినిమా అవుతుంది.