బన్నీ స్టాంప్ వేసిన స్క్రిప్ట్ ఇది..!
ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి ఈ సినిమాతో నిర్మాతగా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో ఆమె ముచ్చటించారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్, అజ్మల్ అమీర్ కలిసి నటించిన సినిమా మంగళవారం. ఈ సినిమాను స్వాతి రెడ్డి, సురేష్ వర్మ కలిసి నిర్మించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి ఈ సినిమాతో నిర్మాతగా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో ఆమె ముచ్చటించారు.
సినిమా నిర్మాణంలోకి ఆలస్యంగా వచ్చానని తాను అనుకోవడం లేదని చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉంది. మాటీవీలో ఉన్నప్పుడే సినిమా నిర్మించాలని అనుకున్నా సురేష్ వర్మ తో కలిసి అది ఇప్పటికి సాధ్యమైందని అన్నారు స్వాతి రెడ్డి. సినిమా నిర్మాణానికి రెడీ అనుకున్నప్పుడు ఈ కథ వచ్చింది. అంతా డెస్టినీ అలా కుదిరిందని అన్నారు.
సినిమా చేద్దామని దాదాపు ఫిక్స్ అవగా బన్నీకి కథ విన్నారు. ఎందుకు కలగా వదిలేయాలి. నువ్వు ట్రై చెయ్.. అయితే నీతో ఎవరైనా పార్ట్ నర్ ఉంటే బాగుంటుందని అన్నాడు. సురేష్ వర్మ గారికి కూడా నిర్మాతగా మారాలని ఉండటంతో ఇద్దరం కలిసి ఈ సినిమా చేశామని అన్నారు స్వాతి రెడ్డి. అజయ్ భూపతి బన్నీని కలిసిన టైం లో నేను లేను. తర్వాత ఫోన్ లో మాట్లాడా.. ఆరెక్స్ 100 కల్ట్ సినిమా.. మహాసముద్రం కూడా బన్నీకి ఇష్టమే. అజయ్ భూపతి డైరెక్షన్ సెన్స్ బన్నీకి ఇష్టం అందుకే సినిమా చేసేయ్ అని అన్నాడు బన్నీ స్టాంప్ వేశాడు కాబట్టి సినిమా చేశానని అన్నారు.
మా టీవీ కన్నా ముందే బన్నీ తనకు మంచి ఫ్రెండ్. మా ఫ్యామిలీస్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అలా మేం కూడా ఫ్రెండ్స్ అయ్యాము. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గెస్ట్ గా రావాలని హెచ్.ఓ.డి కోరితే.. నాన్నకు రిక్వెస్ట్ చేశా. అరవింద్ అంకుల్ కి నాన్న చెప్పి బెంగుళూరు మా కాలేజ్ కి బన్నీ వచ్చేలా చేశారు. ఆ టైం లో మేము క్లోజ్ అయ్యామని అన్నారు స్వాతి రెడ్డి. బన్నీ వైఫ్ స్నేహా కూడా తనకు మంచి స్నేహితురాలని.. ప్రణవ్ స్నేహ స్కూల్ మేట్స్ అని అలా దగ్గరయ్యామని అన్నారు.
ప్రత్యేకంగా ఈ జానర్ సినిమా చేయాలని ఎప్పుడు అనుకోలేదు. కామెడీ ఫిలింస్ ఎక్కువగా చూడం ఇష్టం. థ్రిల్లర్స్ తక్కువ చూస్తాను. అజయ్ భూపతి నరేషన్ విని ఈ సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది. ఇందులో మ్యూజిక్, మెసేజ్, ఎమోషన్ అన్నీ ఉన్నాయని అన్నారు స్వాతి రెడ్డి. ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా కొద్దిగా ఎక్కువైంది. అలా పెడితేనే అజయ్ భూపతి విజన్ స్క్రీన్ మీదకు వస్తుందని అనుకున్నామని అన్నారు స్వాతి రెడ్డి.