స్వయంభు.. ఎవరీ సుందరి.. ఎంతందమైన శిల్పం?
ఈ రోజు సంయుక్త పుట్టినరోజు సందర్భంగా ఆకర్షణీయమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ ఇటీవలే తన కెరీర్ ల్యాండ్‌మార్క్ (20వ) సినిమా 'స్వయంభు' కోసం మార్షల్ ఆర్ట్స్ లో కఠోర శిక్షణ కోసం వియత్నాం వెళ్లాడు. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకుడు కాగా, ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను భువన్ - శ్రీకర్ నిర్మించనున్నారు. నిఖిల్ లెజెండరీ యోధుడి పాత్రలో నటించేందుకు ఆయుధ పోరాటం, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నాడు. నమ్మశక్యం కాని వార్ సీక్వెన్సులతో అలరించే ఈ సినిమాలో అతడు కొన్ని అసాధారణ స్టంట్స్ లో కనిపించనున్నాడు.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ప్రతిభతో మెరిసిపోయే అందం, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ ఇందులో కథానాయికగా నటిస్తోందని తెలిసింది. ఈరోజు సంయుక్త పుట్టినరోజు సందర్భంగా ఆకర్షణీయమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఒక పెద్ద కోట ముందు, భారీ ఆభరణాలతో కూడిన యువరాణి శిల్పంలా సంయుక్త రూపం ఆకట్టుకుంటోంది. అక్కడ ఉన్న అందమైన శిల్పం సంయుక్త చేతిపై ఒక పక్షి వాలి ఉంది. అది తన ప్రియుడి నుంచి ఎలాంటి కబురందించిందో సినిమాలోనే చూడాలి.
స్వయంభూ టాలీవుడ్ లో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న భారీ చిత్రం. రవి బస్రూర్ సంగీతం అందించనుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందించారు. ఫిజికల్ మేకోవర్‌లో ఉన్న నిఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లెజెండరీ యోధుడిగా అద్భుతంగా కనిపించాడు. కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న నిఖిల్ మాంచి జోష్ తో వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.