ఫొటో టాక్: తాప్సి కిక్కిచ్చే గ్లామర్ షో

తాజాగా, ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. తన ఉంగరాల జుట్టను మెస్సీగా వదిలేసింది.

Update: 2023-08-04 08:17 GMT

తాప్సీ పన్ను అందరికీ సుపరిచితమే. ఆమె తెలుగులో ఝుమ్మందినాదం సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టింది. అయితే, అందరి హీరోయిన్స్ లాగా కేవలం గ్లామర్ డాల్ గా ఉండటం తాప్సీకి నచ్చలేదు. అందుకే, అలాంటి రోల్స్ వస్తున్నా, వాటిని పక్కన పెట్టి, కేవలం నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునేవి మాత్రమే ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతోది. అలాంటి రోల్స్ టాలీవుడ్ లో తనకు రావడం లేదని, తన మకాం బాలీవుడ్ కి మార్చేసుకుంది.




 


కాగా, తాప్సీ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ, ఫ్యాన్స్ ని ఆనందపెడుతూ ఉంటుంది. తాజాగా, ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. తన ఉంగరాల జుట్టను మెస్సీగా వదిలేసింది.

కింద బ్లాక్ కలర్ ప్యాంట్ లాంటిది ధరించింది. టాప్ చాలా షార్ట్ గా ఉంది. బికినీ టాప్ లా ఉందని చెప్పొచ్చు. ఫోటోలో మాత్రం చాలా హాట్ గా కనపడుతోంది. దానికి బ్లాక్ మ్యాజిక్ అంటూ క్యాప్షన్ ఇవ్వడం విశేషం. ఈ ఫోటోలు ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

కాగా, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయానికి తాప్సీ చాలా బొద్దుగా ఉండేది. అయినా, ముద్దుగానే ఉండేది. అయితే, ఆ తర్వాత ఆమె తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టింది. ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది. సన్నజాజి తీగలా మారిపోయింది. తెలుగులో చాలా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు, సక్సెస్ రాలేదనే చెప్పాలి. అందుకే తన మకాం మొత్తం బాలీవుడ్ కి మార్చేసింది.

అక్కడ ఆమెకు ఉమెన్ సెంట్రిక్ కథలు వస్తున్నాయి.. ఆమె తన నటనతోనూ సినిమాలను హిట్ చేస్తోంది. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే సక్సెస్ అవుతున్నాయి. ఓటీటీలోనూ తాప్సీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. వరస హిట్లతో దూసుకుపోతోంది.

ఇదిలా ఉండగా, తాప్సీ కాంట్రవర్సీల్లోనూ ముందుంటుంది. తన మనసులోని మాటను ఎలాంటి నిర్భంత్యరం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది. ఇక ఎవరైనా తనని ఏదైనా అంటే, వెంటనే కౌంటర్ ఇచ్చేస్తుంది. ఈ విషయంలో ఆమె అసలు ఎక్కడా తగ్గదు.

Tags:    

Similar News