టాలీవుడ్ లాగే అక్కడా అలాంటి ఎదురుదెబ్బే!
అన్నీ ఉన్నా కొన్నిసార్లు టైం కలిసి రాకపోతే? ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఆ టైమ్ వచ్చే వరకూ వెయిట్ చేయడం తప్ప చేసేదేం లేదు
అన్నీ ఉన్నా కొన్నిసార్లు టైం కలిసి రాకపోతే? ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఆ టైమ్ వచ్చే వరకూ వెయిట్ చేయడం తప్ప చేసేదేం లేదు. ప్రస్తుతం తాప్సీ కెరీర్ విషయంలో అలాగే అనిపిస్తుంది. ఎంతో సంతోషంగా రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టింది. దశాబ్ధం ప్రయాణాన్ని పూర్తి చేసింది. తెలుగులో 'ఝుమ్మంది నాదం' చిత్రంతో లాంచ్ అవ్వగా..బాలీవుడ్ లో ఛష్మీ బద్దూర్ తో ఎంట్రీ ఇచ్చింది.
ఈ రెండు గాక తమిళ్..మలయాళంలో సైతం ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లింది. మరి ఎక్కడైనా సక్సెస్ అయిందా? అంటే కెరీర్ లో చెప్పుకొదగ్గ బ్లాక్ బస్టర్ చిత్రాలంటూ ఏవీ కనిపించలేదు. తెలుగులో అవకాశాలు వస్తున్నా...విజయాలు రావడం లేదని వస్తోన్న అవకాశాల్ని సైతం కాదని బాలీవుడ్ లో మళ్లీ రీ లాంచ్ అయింది. అప్పటి నుంచి అక్కడే సినిమాలు చేస్తోంది. ఎన్నో సినిమాలు చేసింది. ఎంతో మంది స్టార్లతో పనిచేసింది. చివరికి సొంతంగా నిర్మాణ సంస్థని సైతం స్థాపించింది.
మరి అక్కడ అమ్మడు సాధించింది ఏదైనా ఉందా? అంటే అక్కడా సైలెంట్ గా ఉండాల్సిన సన్నివేశమే కనిపిస్తుంది. ఇదంతా 'డంకీ' విజయం గతంలా మార్చేస్తుంది అనుకుంటే? అక్కడా ఫలితం ఆశాజ నకంగా కనిపించడం లేదు. భారీ అంచనాల మధ్య 'డంకీ' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 'పఠాన్'..'జవాన్' విజయాల తర్వాత షారుక్ ఫుల్ స్వింగ్ లో ఉండటంతో డంకీతోనూ 1000 కోట్ల వసూళ్లు తెచ్చే సినిమా అవుతుందని అంచనాలుండేవి.
కానీ 200 కోట్లు కూడా తేవడం కష్టంగా కనిపిస్తుంది. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా పెద్దగా కనిపంచలేదు. ఈ సినిమా కంటే టైగర్ 3 వసూళ్లు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఇక ఈ సినిమాపై తాప్సీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఈసారి కూడా నిరాశ తప్పలేదు. 'డంకీ'తో ఫాంలోకి రావచ్చని చాలా ఆశలే పెట్టుకుని వెయిట్ చేసింది. కానీ ఫలితం మాత్రం అంతకంతకు నిరాశనే మిగిల్చింది. అలాగని తాప్సీ పెర్పార్మెన్స్ ని తీసేయడానికి లేదు.
తన పాత్రకి నూరు శాతం న్యాయం చేసింది. తొలుత ఆ పాత్రకి న్యాయం చేయగలదా? అన్న సందేహం తెరపైకి వచ్చింది. కానీ సినిమా చూసిన తర్వాత ఆ పాత్రకి తాప్సీ మాత్రమే న్యాయం చేయగలదని ప్రూవ్ చేసింది. పాత్ర పరంగా పేరు పెట్టడానికి లేదు. కానీ ఫలితం పరంగా తాప్సీకి మరోసారి నిరాశ తప్పనట్లే కనిపిస్తోంది.