ఇంట‌ర్వ్యూలో క‌ష్టాలు చెప్పుకున్న తాప్సీ!

సినిమా మేకింగ్ అంత సులువు కాద‌ని, నిర్మాత‌గా పెట్టుబ‌డిదారుగా త‌న వెర్ష‌న్ ఓపెనైంది.

Update: 2024-01-27 02:45 GMT

సినిమాలు తీయ‌డం అంత‌ వీజీ కాదండోయ్.. ఈ మాట అన్న‌ది ఎవ‌రో తెలుసా? ఆయ‌న హీరోయిన్ల‌ బొడ్డుపై ప‌ళ్లు ప‌ల‌హారాలు వేయ‌నిదే నిదుర‌పోడు అంటూ కె.రాఘ‌వేంద్రరావును కామెంట్ చేసిన తాప్సీ. ఇటీవ‌ల నిర్మాత‌గా మారిన తాప్సీ ప‌న్ను త‌న క‌ష్టాల‌ను చెప్పుకొచ్చింది. సినిమా మేకింగ్ అంత సులువు కాద‌ని, నిర్మాత‌గా పెట్టుబ‌డిదారుగా త‌న వెర్ష‌న్ ఓపెనైంది.

న‌టిగా తాప్సీ ప‌న్ను చాలా దూరం ప్ర‌యాణించింది. అసాధారణమైన, అద్భుత‌మైన‌ వినోదాత్మక స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటోంది. ఈ జ‌ర్నీలో ఎట్ట‌కేల‌కు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది. సొంత‌కాళ్ల‌పై నిల‌బడి తన సొంత ప్రొడక్షన్ హౌస్ అవుట్‌సైడర్ ఫిల్మ్స్‌ని 2021లో ప్రారంభించింది. అటుపై ఈ బ్యాన‌ర్ లో దూబరా, లూప్ లపేట చిత్రాల్ని నిర్మించి విజ‌యాలు అందుకుంది. ఇప్పుడు `ధక్ ధక్` వంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని నిర్మించింది. ఇటీవలి ఇంటర్వ్యూలో తాప్సీ పన్ను నిర్మాతగా మారడం గురించి, ధక్ ధక్ వంటి చిత్రాలను నిర్మించడం గురించి తన అనుభవాన్ని ఓపెనైంది.

తాప్సీ ఎందుకు నిర్మాతగా మారిందనే విషయం గురించి చెబుతూ, ``నేను సినిమాలో నటించాలని నిర్మాతగా మారలేదు. సులువుగా అవకాశాలు రాని వారికి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాను. ఆర్టిస్టుకు బ్రేక్ రావ‌డం అంత సులభం కాదు. మీకు కావాల్సింది త‌న‌ వద్ద ఉందని ప్రజలను ఒప్పించడం అంత సులభం కాదు. సినిమా కోసం చాలా కష్టపడ్డాను`` అని అన్నారు. `ధక్ ధక్` గురించి మాట్లాడుతూ, ``మీరు ఈ సినిమాని చూస్తే, అది విజువల్స్ లేదా నిర్మాణ విలువల ప‌రంగా వంద‌శాతం బావుంద‌ని అంటారు. నిర్మాతగా నా ప్రవృత్తి సరైనదని నిరూప‌ణ అయినందున, ప్రజలు దీన్ని ఇష్టపడుతున్నందున‌ నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ ప్రతిదానిలో నా ధైర్యాన్ని న‌మ్ముకుంటాను. నేను నిర్మాతగా కూడా అలాగే చేసాను. అది ఇక్కడ కూడా మంచి ఫలితాన్నిచ్చింది`` అని అంది.

న‌టిగా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. తాప్సీ పన్ను ఈ సంవత్సరం రెండు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో న‌టిస్తోంది. తదుపరి దర్శకుడు అర్షద్ సయ్యద్ కామెడీ-డ్రామా చిత్రం `వో లడ్కీ హై కహాన్‌`లో కనిపించనుంది. ఇందులో ప్రతీక్ గాంధీ - ప్రతీక్ పాటిల్ బబ్బర్ ల‌తో క‌లిసి తాప్సీ నటించింది. తాప్సీ న‌టించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం `హసీన్ దిల్‌రూబా` (2021)కి సీక్వెల్ `ఫిర్ ఆయీ హస్సీన్ దిల్‌రూబా` పేరుతో తెర‌కెక్క‌నుంది. జయప్రద్ దేశాయ్ తెర‌కెక్కించిన ఈ సినిమా సిరీస్ రెండవ భాగం లో విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్, జిమ్మీ షెర్గిల్‌ల తారాగణం.


Tags:    

Similar News