తాప్సీ షారుక్ ఖాన్ నడ్డి విరిచేసిందిగా
ఒకే ఏడాది మూడు విజయాలతో షారుక్ కొత్త రికార్డును నమోదు చేసినట్లు అవుతుంది.
షారుక్ ఖాన్ `పఠాన్`..`జవాన్` విజయాలతో పుల్ స్వింగ్ లో ఉన్నాడు. డంకీతోనూ విజయఢంకా మ్రోగించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ఇదే జరిగితే చరిత్ర సృష్టించినట్లే. ఒకే ఏడాది మూడు విజయాలతో షారుక్ కొత్త రికార్డును నమోదు చేసినట్లు అవుతుంది. అందుకోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో డిసెంబర్ 21 కోసం ఎదురు చూస్తున్నాడు. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అయితే `పఠాన్`..`జవాన్` చిత్రాలకు భిన్నమైన చిత్రమిది. రాజ్ కుమార్ హిరాణీ మార్క్ ఎంటర్ టైనర్ . ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. పాటలు సహా టీజర్ ఆకట్టుకుం టున్నాయి. హర్డీ పాత్రలో షారుక్.. మను పాత్రలో తాప్సీ మధ్య ప్రేమను వైవిథ్యంగా..హాస్యభరితంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. లుట్ పుట్ గయా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా కుస్తీ గ్రౌండ్ మ్యాజిక్ ని డంకీలోనూ రిపీట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా షారుక్..తాప్సీ కుస్తీ పోటీలు పడుతున్న కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో తాప్సీ..షారుక్ నడ్డి విడిరిచినట్లే కనిపిస్తుంది. షారుక్ తో తపలడుతూ ఏకంగా భాయ్ ని వీపు మీదకి ఎత్తి అమాంతం కిందకు విసిరేసింది. హర్డీ నడుం నేలకి బలంగా తాకింది. మరో పిక్ లో షారుక్ ని గాల్లోకి విసిరి మరీ కింద పడేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లతో కుస్తీ సీన్లు అంటే షారుక్ కూడా అంతే ఎంజాయ్ చేస్తాడు. తనదమైన మార్క్ హాస్యంతో నవ్వించడం ఆయనకే చెల్లింది. `జవాన్` చిత్రంలోనూ షారుక్-దీపిక పదుకొణే మధ్య కుస్తీ సన్నివేశాలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఆ సీన్లు బాగా పండాయి. మళ్లీ ఇప్పుడు అదే మ్యాజిక్ ని షారుక్ రిపీట్ చేస్తున్నారు. మరి అట్లీ..రాజ్ కుమార్ హిరాణీ అనుకుని కుస్తీ సీన్లు పెట్టారా? యాదృశ్చికంగా జరిగిందా? అన్నది తెలియాలి.