13 ఏళ్ల తర్వాత ఆ సూపర్ జోడీ!
ఈ నేపథ్యంలో తాజాగా సన్నిడియోల్-టబు జోడీనికి కూడా మళ్లీ తె రపైకి తెచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
బాలీవుడ్ లో స్టోరీ డిమాండ్ చేస్తే మళ్లీ పాత జోడీలు జతకడుతోన్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా దర్శకులు రాసుకున్న కథల్లో ఆ జోడీలు కనిపిస్తే బాగుటుంది! అని భావిస్తూ మరో ఆలోచన లేకుండా తెరపైకి తెస్తున్నారు. 'దిలావాలే' సినిమాలో షారుక్ ఖాన్-కాజోల్ అలా జతకట్టిన వారే. హిట్ కాంబోకి పేరుగాంచిన ఆ జోడీతో మళ్లీ ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో రోహిత్ శెట్టి అందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి సినిమా చేసారు.
ఈ క్రమంలో నే 'లాల్ సింగ్ చడ్డా'లో అమీర్ ఖాన్-కరీనా కపూర్ నటించారు. దశాబ్దాల క్రితం ఈ కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలొచ్చాయి. ఆ తర్వాత కొత్త తరం హీరోయిన్లు రావడతో ఈ కాంబినేషన్స్ రేర్ గా సెట్ అవ్వడం కుదురుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సన్నిడియోల్-టబు జోడీనికి కూడా మళ్లీ తె రపైకి తెచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అమీర్ ఖాన్ నిర్మాతగా 'లాహోర్ 1947' అనే చిత్రాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాజ్ కుమార్ సంతోషీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో టబుని తీసుకుంటున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆమెకి జోడీగా సన్నిడియోల్ తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన మేకర్స్ లో మెదలింది. అదే నిజమైతే ఈ జోడీ 13 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ఇదే అవుతుంది. ఇద్దరు జంటగా సినిమాలు చేసి దశాబ్ధం దాటింది. టబు కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి మళ్లీ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది.
లేడీ ఓరియేంటెడ్ నాయికగా సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. అలాగే తెలుగులోనూ మంచి పాత్రలు వస్తే నటిస్తుంది. అలాగే సన్నిడియోల్ కూడా గతం కంటే ఇప్పుడు మరింత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. కీలక పాత్రల్లో అభిమానుల్ని మెప్పిస్తున్నారు.
గడిచి రెండేళ్ల కాలంలో చాలా సినిమాలు చేసారు. అంతకు ముందే ఏడాదికి ఒక సినిమాతోనే మెప్పించేవారు. ఇప్పుడు పద్దతికి గుడ్ బై చెప్పి న్యూ వేలో జర్నీ మొదలు పెట్టి ముందుకు సాగుతున్నారు.