టబు 'జూలియా రాబర్ట్స్ ఆఫ్ ఇండియా' అంటూ ప్రశంస
ఒక నటి ప్రతిభ గురించి చెప్పుకోవాలంటే.. తన చరిత్రను తవ్వాలి.
ఒక నటి ప్రతిభ గురించి చెప్పుకోవాలంటే.. తన చరిత్రను తవ్వాలి. అలా ఈ నటి చరిత్ర మూలాల్ని పరిశోధిస్తే ఎన్నో గొప్ప నట ప్రదర్శనలు... గ్లామర్ తో పాటు ప్రయోగాత్మకత, హద్దులు చెరిపేసిన నట ప్రదర్శన, ఎనర్జీ తనలో కనిపిస్తాయి. అందుకే ఈ హైదరాబాదీ మూలాలున్న నటిని బాలీవుడ్ సముచితంగా గౌరవించింది. ఎన్నో ఫిలింఫేర్ లు..లెక్క లేనన్ని స్థానిక అవార్డులు రివార్డులు తన కెరీర్ లో ఉన్నాయి. జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం తనను వెతుక్కుంటూ వచ్చింది.
ఒక రకంగా ఈ నటి ప్రతిభ గురించి తెలిసిన వారు `జూలియా రాబర్ట్స్ ఆఫ్ ఇండియా` అని కీర్తించేందుకు వెనకాడరు. దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆమె మరెవరో కాదు.. ది గ్రేట్ టబు. హైదరాబాదీ అమ్మాయి. తెలుగు, హిందీ చిత్రసీమల్లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన మేటి కథానాయిక. చాందిని బార్ చిత్రంలో తన ప్రదర్శనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కింది.
ప్రస్తుతం టబు `డూన్: ప్రొఫెసీ` అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది. డూన్ స్పిన్-ఆఫ్ సిరీస్‌లో తాజా చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఎమిలీ వాట్సన్, ఒలివియా విలియమ్స్, మార్క్ స్ట్రాంగ్ లాంటి ఉత్తమ అంతర్జాతీయ తారలతో కలిసి `డ్యూన్: ప్రొఫెసీ` ట్రైలర్‌లో టబు నటించింది. ట్రైలర్ లో తన పాత్ర ప్రాధాన్యత కూడా ఎలివేట్ అయింది. భారతీయ అభిమానులతో పాటు, టబు సహనటి ఎమిలీ కూడా ఇటీవల జరిగిన ప్యానెల్ చర్చలో తనపై ప్రశంసలు కురిపించారు. NYCC (న్యూయార్క్ కామిక్ కాన్)లో అభిమానులు మీడియాతో సంభాషిస్తున్నప్పుడు ప్రముఖ నటి ఎమిలీ భారతీయ నటి టబుతో పని చేసినప్పటి అనుభవాన్ని షేర్ చేసారు. ఎమిలీ మాట్లాడుతూ ``టబు అత్యంత అద్భుతమైన అందమైన నటి. ఆమె జూలియా రాబర్ట్స్ ఆఫ్ ఇండియా`` అంటూ కీర్తించారు.
డూన్ ప్రొఫెసీలో టబుకు పరిమిత స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ డ్యాషింగ్ గా కనిపించిందని అభిమానులు ప్రశంసించారు. ప్రోమో ప్రకారం.. డూన్: పార్ట్ వన్ , డ్యూన్: పార్ట్ 2లో చిత్రీకరించిన సంఘటనలకు ముందు కాల వ్యవధిలో సాగే కథతో తాజా చిత్రం రూపొందింది. డూన్: బట్లెరియన్ జిహాద్ తర్వాత మర్మమైన బెనే గెస్సెరిట్ సోదరిత్వం మూలాలను ప్రదర్శిస్తూ పాల్ అట్రీడెస్ ఎదుగుదలకు 10,000 సంవత్సరాల ముందు జరిగే కథను తాజా చిత్రంలో చూపిస్తున్నారు. ది డ్యూన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఫ్రాంచైజ్ ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన అదే పేరుతో 1965 నవల ఆధారంగా రూపొందింది.
2016లో లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ డూన్ బుక్ సిరీస్ టెలివిజన్ & సినిమా హక్కులను పొందింది. 2017 నాటికి డెనిస్ విల్లెనెయువ్ దర్శకుడిగా రెండు భాగాల సినిమా కథలను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. 2019లో లెజెండరీ టెలివిజన్ విల్లెన్యూవ్ చిత్రాల ఆధారంగా స్పిన్ ఆఫ్ సిరీస్‌ను ప్రారంభించారు. అదే సంవత్సరం పలువురు సృజనాత్మక ప్రతిభావంతులు ప్రాజెక్ట్‌లో చేరారు. అనేక సృజనాత్మక పునర్విమర్శల తర్వాత షాప్కర్ షోరన్నర్‌గా మారారు. అన్నా ఫోయర్స్టర్ జూన్ 2023 నాటికి చాలా ఎపిసోడ్‌లకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఆరు-ఎపిసోడ్‌లతో HBO ఒరిజినల్ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. డూన్: ప్రొఫెసీ నవంబర్ 18న ఉదయం 6:30 గంటలకు ప్రదర్శితం కానుంది. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్‌లు వస్తాయి. జియోసినిమా ప్రీమియంలో ఈ షో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగుకు అందుబాటులో ఉంటుంది.