హీరోల్ని ఆ మాట అడిగే ద‌మ్ము మీలో లేదా?

మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీ అంటూ చాలాసార్లు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచాయి.

Update: 2024-08-03 13:27 GMT

బాలీవుడ్ లో హీరో-హీరోయిన్ల మ‌ధ్య పారితోషికంలో వ్య‌త్యాసం ఆకాశ‌మంత‌. హీరోలు 50 కోట్లు..వ‌చ్చిన లాభాల్లో వాటాలు అందుకుంటారు. కానీ హీరోయిన్ల‌కు మాత్రం 15 కోట్ల‌లోపే ఉంటుంది. దీంతో చాలా కాలంగా ఈ వ్య‌త్యాసం దేనికంటూ గొంతెత్తిన భామ‌లు చాలా మంది ఉన్నారు. హీరోల‌తో స‌మాన పారితో షికం ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన సంద‌ర్భాలెన్నో. మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీ అంటూ చాలాసార్లు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచాయి.

కానీ అవి కేవ‌లం అంత‌వ‌ర‌కే ప‌రిమితం. తాజాగా మే క‌హా ద‌మ్ తా సినిమా ప్ర‌మోష‌న్ లో ఉన్న సీనియ‌ర్ న‌టి ట‌బు ముందుకు ఇదే ప్ర‌శ్న వెళ్లింది. దీంతో అమ్మ‌డు అడిగిన వాళ్ల‌పై అంతెత్తున లేచి ప‌డింది. ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఇదే ప్ర‌శ్న‌వ అడ‌గ‌గ‌ల‌రా? అని రివర్స్ లో అందుకుంది. ఇదే ప్ర‌శ్న నాలాంటి చాలా మంది న‌టీమ‌ణుల్ని అడిగారు. కానీ హీరోల‌ని మాత్రం ఎందుకు అడ‌గ‌లేదు.

వాళ్ల‌కంటే మాకు త‌క్కువ‌గానే పారితోషికం ఇస్తార‌ని మీకు తెలుసు. అయినా మ‌మ్మ‌ల్నే అడుగుతారు. దీనికి సమాధానం నేను ఎలా చెప్ప‌గ‌ల‌ను. త‌క్కువ పారితోషికం తీసుకోవ‌డం న‌చ్చ‌లేద‌న‌లా? లేక ఇచ్చిన దానితో స‌ర్దుకుపోతున్నాన‌ని చెప్పాలా? నేను ఏది చెప్పినా దాన్నిసంచ‌ల‌నం చేస్తారు మీరు. హీరోల‌ను అడిగితేమీకు కావాల్సిన స‌మాధానం వ‌స్తుంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

దీంతో ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ట‌బు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే `ది క్రూ`తో భారీ విజ‌యం అందుకుంది. ముగ్గురు భామ‌లు క‌లిసిన‌టించిన సినిమాలో ట‌బు కీరోల్ కావ‌డంతో సెకెండ్ ఇన్నింగ్స్ లో కొత్త జ‌ర్నీ బాగానే క‌లిసొచ్చింది. మునుప‌టి కంటే ఈ ఏడాదిమ‌రింత జోష్ లో క‌నిపిస్తుంది. గ‌త ఏడాది మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News