తమన్ మాటలు కాంట్రోవర్సియల్!

ఇటీవల రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాణంలో వచ్చిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమాకు ఫ్యాన్‌ వార్ తీవ్రంగా డ్యామేజీ చేసింది అనేది టాక్‌.

Update: 2025-01-18 06:17 GMT

ఏ ఇతర భాషల సినిమా ఇండస్ట్రీలో లేనంతగా టాలీవుడ్‌లో ఫ్యాన్‌ వార్‌ జరుగుతుంది. ఆ ఫ్యాన్‌ వార్ కారణంగా నిర్మాతలు వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఇటీవల రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాణంలో వచ్చిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమాకు ఫ్యాన్‌ వార్ తీవ్రంగా డ్యామేజీ చేసింది అనేది టాక్‌. ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ ఏకంగా సినిమాను ఆన్‌ లైన్ ద్వారా హెచ్‌డీ ప్రింట్‌ని లీక్ చేశారు, అంతే కాకుండా నెగటివ్‌ టాక్ స్ప్రెడ్‌ చేయడంతో పాటు కథ మొత్తం సోషల్‌ మీడియాలో ట్విస్ట్‌లతో సహా షేర్‌ చేయడం ద్వారా ఆ సినిమాకు చాలా డ్యామేజీ జరిగింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బాలకృష్ణ హీరోగా నటించిన సంక్రాంతికి విడుదల అయిన డాకు మహారాజ్ సినిమా విషయంలోనూ అదే చేయాలని కొందరు ప్రయత్నించారు. ముఖ్యంగా నిర్మాత నాగవంశీని కొందరు టార్గెట్‌ చేసి డాకు మహారాజ్ సినిమాకి నెగటివ్‌ టాక్ స్ప్రెడ్‌ చేస్తామని ముందుగానే హెచ్చరించారు. కానీ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ టాక్‌ రావడంతో పాటు, నిర్మాత ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో సోషల్‌ మీడియాలో డాకు మహారాజ్‌ను టార్గెట్‌ చేయడం కాస్త తగ్గించినట్లుగా తెలుస్తోంది. తాజాగా 'డాకు మహారాజ్‌' సినిమా సక్సెస్ మీట్‌లో సంగీత దర్శకుడు తమన్‌ ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్యాన్స్ వార్ వల్ల సినిమా చచ్చిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

తమన్ మాట్లాడుతూ... ఒక సినిమా కోసం నిర్మాత అనేవాడు చాలా కష్టపడుతాడు. చేతిలో ఉన్న డబ్బులు అన్ని పెట్టి, బయట నుంచి తీసుకు వచ్చి కూడా సినిమాను పూర్తి చేస్తారు. ఆ నిర్మాత సినిమా ఇండస్ట్రీకి దేవుడు వంటి వాడు. అలాంటి నిర్మాతను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. నిర్మాతలు సంతోషంగా ఉంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. తాను ఏ ఇండస్ట్రీలో వర్క్ చేసినా అక్కడి వారు తెలుగు సినిమాల్లో చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలుగు సినిమా ఇప్పుడు వెలిగి పోతుంది. అలాంటి తెలుగు సినిమాను కొందరు కావాలని నాశనం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. టాలీవుడ్‌కి ప్రంపచ స్థాయి గుర్తింపు దక్కుతున్న ఈ సమయంలో కొందరు సినిమాని చంపే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

సినిమాపై నెగిటివ్‌ కామెంట్స్ చేయడం వల్ల ఆ ఒక్క సినిమాకు మాత్రమే నష్టం అనుకుంటారు. కానీ మొత్తం ఇండస్ట్రీ ఎఫెక్ట్‌ అవుతుంది. ఏ సినిమాకు నెగిటివిటీ అనేది ఉండకూడదు. ప్రతి సినిమాను ఆధరించాలి. నచ్చితే చూడాలి, లేదంటే ఊరికే ఉండాలి తప్ప నెగటివ్‌ టాక్‌ని స్ప్రెడ్‌ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. అభిమానుల మధ్య గొడవల్లోకి సినిమాను లాగొద్దు అన్నాడు. మీరు మీరు కొట్టుకు చావండి కానీ సినిమా ఇండస్ట్రీని నాశనం చేయొద్దు, సినిమాను చంపొద్దు అన్నాడు. సాధారణంగా తమన స్పీచ్‌ సరదాగా సాగి పోతుంది. కానీ ఈసారి మాత్రం ఆయన స్పీచ్ చాలా సీరియస్‌గా, ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న విషయాలపై మాట్లాడటంతో చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు తమన్‌ స్పీచ్‌ను కొందరు వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News