వాళ్లిద్దరి మనస్సులు ఒక్కటే కాదండోయ్!
అందులో మిల్కీ బ్యూటీ తెలుపు వర్ణం ఉల్లి పొరలాంటి లెహంగా దుస్తుల్లో కనిపిస్తుంది. ఇక ప్రియుడు బ్లాక్ అండ్ వైట్ చారల దుస్తులు ధరించాడు.
తమన్నా-విజయ్ వర్మ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ప్రేమ పీక్స్ కి చేరింది. ఎంగేజ్ మెంట్ ఎప్పుడు చేసుకుంటారు? పెళ్లి తో ప్రేమ బంధానికి ఎప్పుడు ముగింపు పలుకు తారు? అంటే సరైన సమాధానం రావడం లేదు గానీ.. మిగతా ఏ విషయంలోనూ జంట ఎక్కడా తగ్గడం లేదు. జంటగా సోషల్ మీడియాలో అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇద్దరి మధ్య అన్యోన్యతని ఎప్పటికప్పడు చాటి చెబుతూనే ఉన్నారు.
ఇద్దరి ప్రేమ ఎంత బలంగా ఉంది అన్నది సందర్భం వచ్చిన ప్పుడల్లా విసుగు లేకుండా చెబుతున్నారు. ఇక ప్రేమ అంటే సాధారణంగా ఇద్దరి వ్యక్తుల మనసులు కలిస్తే చాలు అంతకు మించి కావాల్సింది ఏముంటుంది? అనుకుంటారు. కానీ తమన్నా-విజయ్ వర్మ లు మనసులే కాదు. ఇంకా చాలానే కలిసాయని తాజాగా ఆ జోడీ చేసిన ఇన్ స్టా పోస్ట్ ని బట్టి తెలుస్తోంది. తమన్నా..విజయ్ వర్మ కొత్త ఫోటో ఒకటి ఇన్ స్టాలో వైరల్ అవుతుంది.
అందులో మిల్కీ బ్యూటీ తెలుపు వర్ణం ఉల్లి పొరలాంటి లెహంగా దుస్తుల్లో కనిపిస్తుంది. ఇక ప్రియుడు బ్లాక్ అండ్ వైట్ చారల దుస్తులు ధరించాడు. ఇలా ముస్తాబై జంటా ఓ పోటో సెషన్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోని ఉద్దేశించి...'మా విలువలు మరియు నమ్మకాలు ఒకేలా ఉంటాయి. అవి చాలా ముఖ్యమైనవి అంటూ రాసుకొచ్చారు. ప్రేమలో మనసులు ఒక్కటే కలిసి పోతే సరిపోదు..ఇద్దరి అభిప్రాయా లు..నమ్మకాలు.. విలువలు కూడా కలవాలి.
అవి ఒకేలా ఉండాలి..భవిష్యత్ లో బంధం బలంగా పెన వేయాలి అంటే ఇవన్నీ కూడా కలవాల్సిందే అంటున్నారు. నిజమే ప్రేమ పెళ్లి అంటే రెండు మనసులే కాదు..రెండు కుటుంబాలు కూడా. వాళ్లని కూడా ఒప్పించి..మెప్పించి పెళ్లి చేసుకోవాలి. అప్పుడే ఆ బంధం ఎంతో బలంగా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ముందు వాళ్లిద్దరు అభిప్రాయాలు గౌరవించుకోవాలి. ప్రస్తుతం ఈ ఫోటో ..పోస్ట్ రెండు వైరల్ అవుతున్నాయి. జోడీ ప్రేమలో పడిన తర్వాత చాలా విషయాలే తెలుసుకున్నట్లున్నారని నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు.